Revolver Warning: భూపాలపల్లి జిల్లాలో ఓ బీజేపీ నేత నారాయణ రెడ్డి బరితెగించాడు. రివాల్వర్‌తో చంపేస్తానని ఓ న్యాయవాదికి వార్నింగ్ ఇచ్చాడు. తన కేసు వాదిస్తున్న అడ్వకేట్ అలీని చంపుతానని బెదిరించి దాడిచేయడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రాణభయంతో పోలీసులకు అడ్వకేట్ అలీ ఫిర్యాదు చేశాడు. దీంతో బీజేపీ నేత అయిన చల్లా నారాయణ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసారు.
వివరాల్లోకి వెలితే..
భూపాలపల్లి జిల్లాలో బీజేపీ నేత నారాయణ రెడ్డి(Narayana Reddy) బరితెగింపు చర్చనీయాంశంగా మారింది. రివాల్వర్‌తో చంపేస్తానని న్యాయవాదికి వార్నింగ్ ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. తన కేసు వాదిస్తున్న అడ్వకేట్ అలీ(Advocate Ali)ని చంపుతానని బెదిరించి దాడికి ప్రయత్నించాడు. దీంతో ప్రాణభయంతో అడ్వకేట్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో బీజేపీ నేత చల్లా నారాయణ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 296(బీ), 351(2) బీఎన్ఎస్ పలు సెక్షన్ల కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. గత వారం రోజుల క్రితం భూపాలపల్లిలో రౌడీషీటర్ల గన్ ఫైరింగ్ సంఘటన మరువకముందే.. రాజకీయ నాయకులు సైతం రివాల్వర్‌తో బెదిరింపులకు పాల్పడుతుండటంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్(Law and Order) గాడి తప్పిందంటూ జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది.
