Archana Iyer: ‘శంబాల’లో అవి ఉండవని ముందే చెప్పారు
Archana Iyer (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Archana Iyer: ‘శంబాల’లో రొమాంటిక్ పాటలు, స్టెప్పులు ఉండవని ముందే చెప్పారు

Archana Iyer: వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ (Aadi Saikumar) హీరోగా షైనింగ్ పిక్చర్స్ ‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు నిర్మించిన చిత్రం ‘శంబాల: ఎ మిస్టిక్ వరల్డ్’ (Shambhala: A Mystic World). యుగంధర్ ముని (Ugandhar Muni) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. డిసెంబర్ 25న క్రిస్మస్ స్పెషల్‌గా భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుని, సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ అర్చన ఐయ్యర్ (Archana Iyer) మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఆమె మాట్లాడుతూ..

ముందే ఆ విషయం చెప్పారు

‘‘నేనూ తెలుగమ్మాయినే. మాది చిత్తూరు జిల్లానే. కానీ చదివింది మొత్తం బెంగళూరులోనే. నా మాతృభాష తెలుగే. ‘శంబాల’లో నేను చేసిన దేవి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి. అందులో ఆడియెన్స్ నా పాత్రను బాగా ఆదరిస్తున్నారు. నేను కనిపించిన ప్రతీ సారి ఆడియెన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఆదితో నా కాంబినేషన్ సీన్లకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే చాలా మంది దర్శకులు ఫోన్ చేసి అభినందించారు. ఇప్పటి వరకు వేసిన ప్రతీ ప్రీమియర్ హౌస్ ఫుల్ అవుతోంది. చాలా చోట్ల ఆడియెన్స్‌ భయపడిపోతున్నారు. వాస్తవానికి ‘శంబాల’ నెరేషన్ పూర్తిగా వినకుండానే ఓకే చేశాను. ఇందులో స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. రొమాంటిక్ పాటలు, స్టెప్పులు వేసే పాత్ర కాదని నాకు ముందే చెప్పారు. ఇలాంటి డిఫరెంట్ పాత్ర నా కెరీర్ ఆరంభంలోనే రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ప్రస్తుతం ప్రేక్షకులు రెగ్యులర్ చిత్రాల్ని చూడటానికి ఇష్టపడటం లేదు. కొత్త కంటెంట్ ఉంటేనే, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. నాకు ఇంత మంచి సినిమా, పాత్ర రావడం చాలా ఆనందంగా ఉంది.

Also Read- Chinmayi Sripada: నీ కొడుకులకు కూడా.. మరోసారి శివాజీకి ఇచ్చిపడేసిన చిన్మయి!

ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే

ఈ సినిమా విషయంలో నిర్మాతలు మాకెంతో సపోర్ట్ చేశారు. మధ్యలో బడ్జెట్ పెరిగినా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. సినిమాపై ఉన్న నమ్మకంతో గ్రాండ్‌గా నిర్మించారు. మా ఆర్టిస్టులందరినీ ఎంతో బాగా చూసుకున్నారు. వారిచ్చిన సహకారంతోనే అందరం బాగా నటించగలిగాం. ఆదితో వర్క్ చేస్తూ.. చాలా విషయాల గురించి తెలుసుకున్నాను. ఆయన నిజంగా డౌన్ టు ఎర్త్. చాలా తక్కువ మాట్లాడతారు. అద్భుతంగా నటిస్తారు. చాలా మంచి వ్యక్తి. నా ఈ జర్నీలో నాకెంతో అండగా నిలబడ్డారు. ఆయనతో మళ్లీ మళ్లీ నటించాలని కోరుకుంటున్నాను. ‘శంబాల’ సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఇలాంటి చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఆ వైబ్, ఆ ఫీలింగ్ వస్తుంది. విజువల్‌గా, సౌండ్ పరంగా కూడా ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ను టచ్ చేస్తూ తీసిన ఈ చిత్రం ఈ క్రిస్మస్‌కి సరైన ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. ‘శంబాల’ చిత్రానికి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రీమియర్లకు వస్తున్న స్పందన చూసి టీమంతా ఫుల్ ఖుషీగా ఉంది. ‘శంబాల’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.

Also Read- AP Govt: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

పాత్ర డిమాండ్ చేస్తే రొమాంటిక్ సీన్స్ చేస్తా..

ఈ సినిమా తర్వాత ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఫ్యాంటసీ మూవీ ఒకటి చేస్తున్నాను. అది 500 ఏళ్ల క్రితం జరిగే కథ. భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఎప్పుడూ కూడా నాకు కంఫర్ట్‌గా ఉండే పాత్రలనే ఎంచుకుంటాను. స్టోరీకి తగ్గట్టుగా పాత్ర డిమాండ్ చేస్తే మాత్రం రొమాంటిక్ సీన్లు చేయడానికి ఓకే. నాకు మాత్రం ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనే కోరిక ఉంటుంది. మంచి చిత్రాలను చేయాలని, మంచి కథల్ని చెప్పాలని, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను’’ అని అర్చన ఐయ్యర్ చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SS Rajamouli: ‘ఛాంపియన్’కు దర్శకధీరుడి ఆశీస్సులు.. పోస్ట్ వైరల్!

Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

KTR: ప్రజలు కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయం.. జలద్రోహాన్ని ఎండగడతాం..కేటీఆర్ ఫైర్!

Archana Iyer: ‘శంబాల’లో రొమాంటిక్ పాటలు, స్టెప్పులు ఉండవని ముందే చెప్పారు

Thummala Nageswara Rao: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు