Nizamabad MLA PA: చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పీఏగా
Nizamabad MLA PA ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Nizamabad MLA PA: ఆ జిల్లాలో నోటీసుల కలకలం. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు ఎమ్మెల్యే పీఏగా చేయడం ఏంటి?

Nizamabad MLA PA:  నిజామాబాద్ రూరల్ ఎమ్మెలే పి ఏ శ్రీనివాస్ రెడ్డి,DEOఅశోక్ కు నోటీసులు జారి చేసింది హ్యూమన్ రైట్స్ కోర్టు. చాలా కాలంగా ప్రభుత్వ ఉపాద్యాయునిగా ఉండి ఎమ్మెలే పి ఏ గా పనిచేయటాన్ని తప్పు పట్టిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వివరణ కోసం హాజరు కావాలని ఆదేశం జారీ చేసింది కోర్టు. విద్యా హక్కు చట్టం నిబంధనలను అతిక్రమిస్తున్నారని ఇద్దరిపై ఆర్టీఐ కార్యకర్త గోపాల్ పిర్యాదు చేశారు. నోటీసులపై స్వేచ్ఛ ప్రతినిధి వివరణ కోరడంతో DEO అశోక్ సమాధానం ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామనీ స్పష్టం చేశారు.

Also Read: Nizamabad: ఆ జిల్లాలో కష్టకాలంలో.. పార్టీ జెండా మోసినవాళ్లకే జిల్లా పరిషత్

ఎవ్వరైనా నిబంధనలు పాటించాల్సిందే

ప్రభుత్వ టీచర్లుగా ఉన్నవారు ప్రజా ప్రతినిధుల పీఏలుగా పనిచేయరాదనీ అన్నారు. ఎవ్వరైనా నిబంధనలు పాటించాల్సిందే అంటూ హెచ్చరించారు. సెలవులో ఉండటం వల్ల కోర్టు నోటీసులు చూడలేకపోయామని, అలాగే 2023 నుంచి ఇంగ్లీష్ టీచర్ అంటూ లక్షల జితలు తీసుకుంటూ పిల్లలకు విద్య చెప్పకుండా ఎంఎల్ఏ కు పీ ఏ గా పనిచేయడం పై హ్యూమన్ రైట్స్ కోర్టు ఈ ఇష్యుని సిరియస్ తీసుకుంది. సదరు ఇంగ్లీష్ టీచర్ అయినా శ్రీనివాస్ రెడ్డి కి నోటీసులు జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలో ఎంఎల్ఏ లకు పీ ఏ లుగా ఉన్న వారందరి గుండెల్లో ఒక్క సారిగా గుబులు పుట్టించే ఈ నోటీసులు ఘటన చర్చా నియాంశంగా మారింది.

Also Read: Nizamabad district: కులవృత్తిదారుల నుంచి లక్షల్లో వసూలు.. ఇవ్వకుంటే కుల బహిష్కరణలు

Just In

01

Chiranjeevi: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మార్కెట్‌లోకి వచ్చేశారు..

SS Rajamouli: ‘ఛాంపియన్’కు దర్శకధీరుడి ఆశీస్సులు.. పోస్ట్ వైరల్!

Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

KTR: ప్రజలు కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయం.. జలద్రోహాన్ని ఎండగడతాం..కేటీఆర్ ఫైర్!

Archana Iyer: ‘శంబాల’లో రొమాంటిక్ పాటలు, స్టెప్పులు ఉండవని ముందే చెప్పారు