Nizamabad (IMAGE CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Nizamabad: ఆ జిల్లాలో కష్టకాలంలో.. పార్టీ జెండా మోసినవాళ్లకే జిల్లా పరిషత్

Nizamabad: ఆ జిల్లా పరిషత్ చైర్మన్ కోసం హేమాహేమి నాయకులు బరిలో దిగుతున్న అధిష్టానం లైట్ తీసుకుంటుంది అంట. ఎందుకంటే ఆ జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ జెండా మోసినా వారికే పట్టం కట్టనున్నారు అనేది జొరందుకున్న చర్చా. ముఖ్యంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీ నీ వీడి పదవుల కోసం పార్టీ మారి కష్టకాలంలో పార్టీని విడిచి పెట్టీ బీ ఆర్ ఎస్ లో చేరడం ఇప్పుడు పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ పార్టీలో చేరి పదవులు ఆషించడంతో అక్కడ ఆ జిల్లా పరిషత్ చైర్మన్ సీటు హిటెక్కుతుందట… అంతలా పార్టీని వీడి పదవుల కోసం వచ్చింది ఎవరు పార్టీని కష్టకాలం లో ఉన్నప్పుడు నమ్మకంతో ఉన్నదెవరు.  

 Also Read: World Skills Competition 2026: వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ కు దరఖాస్తులు ఆహ్వానం: బాలకిష్టారెడ్డి

మహిళ రిజర్వేషన్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రత

నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళ రిజర్వేషన్ కావడంతో కాంగ్రెస్ పార్టీలో పోటీ తీవ్రత పెరిగింది. ముఖ్యంగా గత పది ఏళ్లపాటు బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ పార్టీ జెండాను మోసిన వారికే ఈసారి జిల్లా పరిషత్ చైర్మన్ సీటును పట్టం కట్టనుంది. అయితే పదవుల కోసం ఆశపడి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన కొందరు అధికారంలో బీఆర్ఎస్ లేకపోవడంతో మళ్లీ విడిచిపెట్టిన కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది వచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి ద్రోహం

ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కాంగ్రెస్ లో ఉన్న సమయంలో ఆర్మూర్ టికెట్ ఆశిస్తే టికెట్ ఇచ్చి నిలబెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి కి సపోర్ట్ చేస్తూ సరెండర్ అయ్యేరని అప్పట్లో పెద్ద దుమారమే లేపిందట. ఎన్నికలు కాగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ లో చేరగానే ఆమెను ఎమ్మెల్సీ చేశారు బీఆర్ఎస్ పార్టీ. తదనంతరం రెన్యువల్ కాకపోయే సరికి వెంటనే ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశారు. ఇక మొన్నటి ఎన్నికల్లో అధికారంలో బీఆర్ఎస్ లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వచ్చారు. పార్టీలో చేరే ముందు ఎలాంటి పదవులు ఆశించకుండా వస్తె రా అంటూ గతంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పేశాడట.

అనిల్ భార్య సుహాసిని పై అధిష్టానం మొగ్గు

అయితే ఇప్పుడు ఆ జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చెప్పారని తన స్థానాన్ని బాల్కొండ అభ్యర్థి సునీల్ రెడ్డి కి త్యాగం చేసిన ఇప్పటి మినరల్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ఈరవత్రి అనిల్ భార్య సుహాసిని పై అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మెండోర నుంచి జిల్లా పరిషత్ కోసం జెడ్పిటిసి గా పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈరవత్రి అనిల్ పార్టీలో సీనియర్ నేతగా కష్టకాలం లో ఉన్న సమయంలో పార్టీకి అండగా ఉండటం ఇక పార్టీలో నేతలందరూ సపోర్ట్ తో సిఎం రేవంత్ కి అత్యంత సన్నిహితులు గా ఉండటం ఇలాంటి పరిణామాలు కలిసి వస్తున్నాయట. నిజామాబాద్ జిల్లాలో పేరు ప్రకటన కాకున్నా అనిల్ భార్య సుహాసిని కి అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు ఆ జిల్లాలో చర్చా జోరందుకుంది.

 Also Read: Srinidhi Shetty : వారి కోసం 24 గంటలు ఆ పని చేస్తా.. శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది