Srinidhi Shetty: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ‘కేజీఎఫ్’ మూవీతో రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు ఇప్పుడు తన కొత్త చిత్రం ‘తెలుసు కదా’ తో ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా, శ్రీనిధి శెట్టితో పాటు రాశి ఖన్నా కూడా హీరోయిన్‌గా కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న శ్రీనిధి శెట్టి, వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. యాంకర్ ఆమెను ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.. “సూపర్‌స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో నటించే అవకాశం వస్తే మీరు ఎవరిని ఎంచుకుంటారు?” ఈ ప్రశ్నకు శ్రీనిధి స్మార్ట్‌గా స్పందిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. “ఒకవేళ మహేష్ బాబు, ఎన్టీఆర్‌లతో ఒకేసారి నటించే అవకాశం వస్తే, నేను ఆ రెండు ప్రాజెక్ట్‌లనూ ఖచ్చితంగా చేస్తాను. ఈ రెండు అవకాశాలనూ వదులుకోవడం ఎవరికైనా సాధ్యమా? రాత్రి-పగలు అనే తేడా లేకుండా కష్టపడి పని చేస్తాను అని చెప్పుకొచ్చింది.
మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పని చేయడం ఏ నటి కలలోనైనా ఉంటుంది. వారిద్దరూ పాన్ ఇండియా స్థాయిలో అపారమైన ఆదరణ సొంతం చేసుకున్న స్టార్స్. వారితో స్క్రీన్ షేర్ చేసే అవకాశం కోసం సెలబ్రిటీలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అలాంటి అవకాశం నాకు వస్తే, నేను ఏమైనా చేసి, ఆ పాత్రలను పోషిస్తాను,” అని శ్రీనిధి చెప్పుకొచ్చింది. ఆమె ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, శ్రీనిధి శెట్టి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.
మహేష్ బాబు, ఎన్టీఆర్‌లాంటి స్టార్ హీరోల పట్ల ఆమె చూపిన ఆసక్తి, వారి సినిమాల్లో నటించాలనే ఆమె ఉత్సాహం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ‘తెలుసు కదా’ చిత్ర విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, శ్రీనిధి శెట్టి ఈ వ్యాఖ్యలతో మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ యంగ్ హీరోయిన్ భవిష్యత్తులో మరెన్నో బిగ్ ప్రాజెక్ట్‌లతో అలరిస్తుందనడంలో సందేహం లేదు.
