Seethakka: రాజ్యాంగాన్ని గౌరవించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా
Seethakka ( image credit: swetcha reporter)
Uncategorized

Seethakka: రాజ్యాంగాన్ని గౌరవించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తోంది.. మంత్రి సీతక్క!

Seethakka:  తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని గౌరవించి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క (Seethakka) పేర్కొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల చేత గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ… ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో నిరుపేదలకు, మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సమ్మక్క సారలమ్మ పునర్నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి రూ.251 కోట్ల నిధులు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ విగ్రహాల పున ప్రతిష్టాపన, శాశ్వత అభివృద్ధి పనుల కోసం కేటాయించి ఆదివాసీల గౌరవాన్ని కాపాడుతున్నారని పేర్కొన్నారు.

Also Read: Seethakka: మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క!

కనివిని ఎరగని విధంగా కేబినెట్ మీటింగ్

ములుగు జిల్లాలో కనివిని ఎరగని విధంగా కేబినెట్ మీటింగ్ నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. అది కేవలం ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని వెల్లడించారు. జగ్గన్నపేట గ్రామంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కుంజ సూర్య జాతీయ జెండా ఆవిష్కరణ ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్స్ ఫ్యాడ్స్ అందించారు. ఈ కార్యక్రమాల్లో టిపిసిసి ప్రధాన కార్యదర్శి మల్లాడి రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, పంచాయతీరాజ్ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా, మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గుంటోజు పావని, జగ్గన్నపేట గ్రామ సర్పంచ్ అర్రెమ్ వెంకన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read: Seethakka: మేడారం జాతరకు తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు.. పనితీరును సమీక్షిస్తూ మంత్రి సీతక్క దిశానిర్దేశం!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?