World Skills Competition 2026: వరల్డ్ స్కిల్ కాంపిటిషన్ 2026లో పాల్గొనే అభ్యర్థులు ఈనెల 15లోగా ఆన్లైన్ రిజిస్ర్టేషన్ చేసుకోవాలని తెలంగాణ(Telangana) ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి(Balakrishna Reddy), కాంపిటిషన్ స్టేట్ కోఆర్డినేటర్ ప్రశాంతి తెలిపారు. టీజీసీహెచ్ ఈ కార్యాలయంలో సోమవారం కౌన్సిల్ వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం, సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్ తో కలిసి వారు నోటిఫికేషన్ వివరాలు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. వరల్డ్ స్కిల్ కాంపిటిషన్స్ ను స్కిల్ ఒలింపిక్స్ గా పిలుస్తారన్నారు.
రాష్ట్రస్థాయిలో ఎంప్లాయిమెంట్..
ఈ పోటీల్లో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని సత్తాను చాటాలని కోరారు. ఇండియా స్కిల్ పోటీలకు రాష్ట్రస్థాయిలో ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉందన్నారు. సైబర్ సెక్యూరిటీ(Cyber Security,), వెబ్ టెక్నాలజీస్(Web Technologies), అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్(Additive Manufacturing), ఐటీ నెట్‌వర్క్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్(IT Network Systems Administration), గ్రాఫిక్ డిజైన్(Graphic design), కార్ పేయింటింగ్(Car painting), హోటల్ రిసెప్షన్ వంటి 63 స్కిల్ విభాగాల్లో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు www.skillindiadigital.gov.in వెబ్ సైట్ ద్వారా ఉచితంగా రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని వివరించారు.
చదువుతో సంబంధం లేదు
ఇప్పటికే 5,500 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. వచ్చేనెలలో జోనల్ లెవెల్ పోటీలు, డిసెంబర్ లోపు రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని వెల్లడించారు. వచ్చే ఏడాది సౌత్ రిజినల్ స్టేట్ పోటీలు, జాతీయ స్థాయి పోటీలు ఉంటాయనీ చెప్పారు. నేషనల్ లెవెల్లో మొదటి స్థానంలో నిలిచిన వారిని వచ్చేఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని షాంఘై లో జరిగే పోటీలకు అర్హులవుతారన్నారు. దీనికి చదువుతో సంబంధం లేదని, కేవలం 16 ఏండ్ల నుంచి 24 ఏండ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. అయితే, ఈ పోటీల్లో పాల్గొనే డిగ్రీ(Degree), ఇంజినీరింగ్ విద్యార్థులకు క్రెడిట్స్ కూడా ఉంటాయని చెప్పారు.
Also Read: Tummala Nageswara Rao: టోల్ ఫ్రీ నంబర్ గూర్చి విస్తృత ప్రచారం చేయండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
