Narayanpet District: డిసెంబర్ 17న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నారాయణపేట(Narayanpet) జిల్లా మఖ్తల్ మండలం ముస్లాయిపల్లి(Muslaipalli) గ్రామ పంచాయతీ ఎన్నిక ఫలితాలు రోజురోజుకీ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈనెల 17న జరిగిన పోలింగ్ లో ఒకే వ్యక్తి రెండుసార్లు వేరువేరు వార్డులలో ఓటు వేయడం వల్ల ఒక్క ఓటుతో తనతో పాటు సర్పంచ్ పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పవిత్ర(Pavithra) గెలుపు పై తమ వర్గంతో కలిసి పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకుండా ప్రత్యర్థి పవిత్ర గెలుపును ప్రకటించారని దొంగ ఓట్లను తొలగించి న్యాయపరంగా తీర్పు ఇవ్వాలని అప్పటివరకు సర్పంచ్ గా ప్రమాణస్వీకారం జరగకుండా స్టే ఇవ్వాలని గురువారం రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని అందుకు W.P.No.39296/2025 at Hon’ble High court,Telangana Hyderabad నందు కేసు నమోదు చేశారు.
ఒకే వ్యక్తి రెండుసార్లు నాలుగు ఓట్లు
ముస్లాయిపల్లి గ్రామంలో జరిగిన సర్పంచి ఎన్నికల్లో తెరాస పార్టీ పై కాంగ్రెస్(Congress) అభ్యర్థి పవిత్ర ఒక్క ఓటుతో గెలవడం జరిగింది. దీనిపై అప్పుడే రికౌంటింగ్ చేయమని కోరిన అధికారులు పట్టించుకోలేదని ఒక వ్యక్తి రెండు వార్డుల్లో నాలుగు ధపాలుగా 3,4 వార్డులో సర్పంచికి వార్డ్ మెంబర్లకు ఓటేసిందని దాని ఆధారాలు కూడా సేకరించామని ఒకే వ్యక్తి రెండుసార్లు నాలుగు ఓట్లు వేసినట్టుగా అక్కడ ఉన్న ఎన్నికల అధికారులకు, పోలీసులకు చెప్పిన పట్టించుకోలేదని ఈ విషయంపై సాక్షాలతో ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశామని గురువారం కోర్టులో కేసు నమోదు చేశామని ప్రత్యర్థి చెబుతున్నారు.
Also Read: Bigg Boss9 Telugu: బిగ్ బాస్ 9 హౌస్‌లోకి ‘మిస్సమ్మ’ జోడీ.. శివాజీ, లయల సందడి మామూలుగా లేదుగా..
ఫిర్యాదు పై పూర్తి ఎంక్వయిరీ..
ప్రతి పోలింగ్ బూతులు సీసీ కెమెరాలు రికార్డు ఉండాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్న ముస్లాయి పల్లి గ్రామంలో పాటించ లేదన్నారు. ఒక మహిళ నాలుగు సార్లు ఓటేసినట్టుగా అక్కడున్న తమ పార్టీ పోలింగ్ ఏజెంట్(Poling Azent) చెప్తున్నారని అందుకు సాక్ష్యంగా సేకరించి కొర్టు సమర్పించా మన్నారు. తక్షణమే అధికారులు స్పందించి తమ ఫిర్యాదు పై పూర్తి ఎంక్వయిరీ చేయించేంతవరకు సర్పంచ్ ప్రమాణస్వీకారాన్ని నిలిపివేయాలని లేనియెడల తమ పార్టీ అగ్రనేతలతో కలిసి సోమవారం జరిగే ప్రమాణ స్వీకారం అడ్డుకుంటామని వారు తెలిపారు. ఇట్టి విలేకరుల సమావేశంలో పారేవుల మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, ముస్లాయిపల్లి, మాజీ ఎంపిటిసి అశిరెడ్డి, ముస్లాయిపల్లి గ్రామ వార్డు మెంబర్లు లక్ష్మణ్ గౌడ్, బాచుపల్లి రేణుక, వాకిటి గోవింద్, ఆర్.రేణుక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Adwait Kumar Singh: వరదలు, పరిశ్రమ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్!

