Vegetable Prices: సామాన్యులకు ధరల దడదడ
రోజురోజుకి పెరుగుతున్న కూరగాయల రేట్లు
అటు చికెన్ ధరలదీ అదే పరిస్థితి
వంట నూనెలు, కోడిగుడ్ల పరిస్థితి అంతే
తగ్గుతున్న సాగు విస్తీర్ణమే కారణమా?
ధరల అదుపులోకి తేవాలని కోరుతున్న ప్రజలు
గద్వాల, స్వేచ్ఛ: పెరిగిన నిత్యవసరాల ధరలు (Vegetable Prices) ఆకాశాన్ని అంటడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత కొంతకాలంగా ధరల తగ్గుదల లేకపోవడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతోంది. దీంతో కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితికి తగ్గుతున్న కూరగాయల సాగు విస్తీర్ణం కారణమా? లేకపోతే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత వర్షాకాలం నుంచి కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో, ధరలు ఎడాపెడా పెరుగుతున్నాయి. దీంతో, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చికెన్ ధరలది అదే పరిస్థితి
ఇటీవల చికెన్ ధర త్రిబుల్ సెంచరీ కొట్టింది. మూడు నెలలుగా 250 వద్ద కొనసాగుతున్న ధర రెండు వారాల వ్యవధిలోనే 300 పైకి వచ్చింది. ఇప్పటికే గుడ్డు ధర రూ.7 దాటి గుడ్లు తేలేస్తోంది. పెరిగిన మాంసం ధరలతో దిమ్మతిరిగిపోతోందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రస్తుతం బ్రాయిలర్ చికెన్ కేజీ 300 కు చేరింది. లైవ్ కోడి 170కు పెరిగింది. గుడ్ల అమ్మకాల్లో హోల్సేల్ కు రిటైట్ కు వ్యత్యాసం ఉండడంతో ధరలు ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
Read Also- Veenvanka Anganwadi Centres: అంగన్వాడీ పౌష్టికాహారం పక్కదారి.. పసిపిల్లల ఆహారంపై అక్రమార్కుల కన్ను!
నింగినంటిన నిత్యావసర సరకుల ధరలు
ఏ వస్తువును ముట్టుకున్న ధరలు భగ్గుమంటున్నాయి. సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లిన సామాన్యుల గుండెలు గుబేలుమంటున్నాయి. పెరిగిన వంట సరుకుల ధరలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. దోసెడు డబ్బులు పోసినా గుప్పెడు సరుకులు రావడం లేదు. ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు నిరుపేదల పరిస్థితి. పండుగ రోజు కాసిన్ని పిండి వంటలు చేసుకొని కుటుంబ సభ్యులతో కలిసి తినే భాగ్యానికి కూడా సామాన్యుడు నోచుకోలేక పోతున్నాడు. దరలు దడ పుట్టిస్తున్నాడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
ఆందోళనలో పేద మధ్యతరగతి ప్రజలు
వంట నూనెల ధరలు, మిర్చి రెట్లు ఘాట్ ఎక్కిస్తోంది. ధరభారం చూసి పేదలు, సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. సన్ ఫ్లవర్, రైస్ బ్రాన్ ,వేరుశనగ రిపైర్డ్ నూనె పేరుతో విక్రయాలు జరుపుతున్నారు. ప్రస్తుతం 165 కు చేరుకుంది. ధరలు మరింత పెరుగుతాయని ప్రచారం జరుగుతున్నడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధరలు నియంత్రించి సామాన్యులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

