Makthal Municipality: మఖ్తల్ మున్సిపాలిటీ ఎన్నికల పోరులో అంతా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జనసేన పార్టీ పోరుకు సై అంటూ మూడు వార్డుల నుండి నామినేషన్ దాఖలు చేసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్(Pawankalyan) ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో స్థానిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ పోటీ చేయగా మఖ్తల్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఆడ్ హాక్ కమిటీ సభ్యులు, మఖ్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో మఖ్తల్ నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామ గ్రామాన పర్యటించి యువతలో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా యువతను పార్టీలోకి ఆహ్వానించింది.
రాష్ట్ర నాయకులు ఆదేశం
స్థానిక ఎన్నికల్లో మఖ్తల్ నియోజకవర్గంలో కూడా నాలుగు సర్పంచు, నాలుగు వార్డు మెంబర్ స్థానాలకు పార్టీ బీఫాంతో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలపై కోటికి అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే ఏ మాత్రం వెనుకంజ వేయకుండా పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు రెండవ మఖ్తల్ మున్సిపాలిటీ ఎన్నికల పోరులో పోటీకి సై అంటూ జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఆదేశం మేరకు మఖ్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ మఖ్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను రెండు,ఐదు, ఏడు వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసి నామినేషన్లు దాఖలు చేసింది. యువత రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు.
Also Read: MP Etela Rajender: మీ అవసరాలు తీర్చే నాయకున్ని ఎన్నుకోండి: ఎంపీ ఈటెల రాజేందర్
పార్టీ ఆశయాలు
జనసేన పార్టీ బలపరిచిన యువ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదిస్తారని మణికంఠ గౌడ్(Manikanta Goud) అన్నారు. మున్సిపల్ పోరులో ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు మఖ్తల్ మున్సిపాలిటీ ప్రజలు యువతకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. జనసేన పార్టీ స్థాపించిన రాష్ట్రం వేరైనా పార్టీ ఆశయాలు వేరని భారత రాజ్యాంగం ప్రకారం యువకులు రాజ్యాధికారాన్ని పొందాలని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ మన ధర్మాన్ని రక్షించుకునేందుకు యువకులు పాటుపడాలన్నది పార్టీ యొక్క ఉద్దేశమని ఆయన అన్నారు. కావున జనసేన పార్టీ బలపరిచిన మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న యువకులను ఆశీర్వదించి ప్రశ్నించేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు.

