Mahabubabad District: ఆ రైస్ మిల్లు అత్యాచారాలకు, అక్రమాలకు
Mahabubabad District ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: ఆ రైస్ మిల్లు అత్యాచారాలకు, అక్రమాలకు నిలయం.. వయో వృద్ధురాలిపై బీహార్ వ్యక్తి అత్యాచారం!

Mahabubabad District: ఆ ఊరిలో ఉన్న రైస్ మిల్లు అత్యాచారాలకు, అక్రమాలకు కేరా ఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆ మిల్లుల నుంచే వందల క్వింటాళ్ల పిడిఎస్ రైస్ అక్రమాలకు పాల్పడిన ఘటనలు, ఆరోపణలు ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీకి చెందిన బండారి శ్రీనివాస్ రెడ్డి ఈ మిల్లును నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉన్న మిల్లు ఆపరేటర్లను కాకుండా బీహార్ కు చెందిన వ్యక్తులను తక్కువ జీతంతో పెట్టుకొని అక్రమంగా మిల్లును నిర్వహిస్తున్నారు.

బిహారి వ్యక్తి వెనుక నుంచి వచ్చి దాడి

గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకుంటున్న ఓ దాదాపు 48 సంవత్సరాల వయసున్న మహిళపై ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలోని శ్రీనివాస ఆగ్రో రైస్ మిల్లు లో పనిచేస్తున్న బిహారి వ్యక్తి వెనుక నుంచి వచ్చి దాడి చేసి దారుణంగా కొట్టి ఆ పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం పక్కనే ఉన్న వ్యవసాయ రైతులు గమనించి విషయాన్ని గ్రామస్తులకు, సమీపంలోనే ఉన్న తండాకు చేరవేయడంతో, గ్రామస్తులు, తండావాసులంతా వచ్చి బిహారి వ్యక్తిపై దాడి చేశారు.

Also Read: Mahabubabad District: ఆ రెండు గ్రామాలు రాష్ట్రానికే ఆదర్శం.. ఇద్దరు సర్పంచులు 18 వార్డులు ఏకగ్రీవం!

పూర్తిస్థాయిలో దర్యాప్తును పోలీసులు

ఈ విషయాన్ని తెలుసుకున్న కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఇనుగుర్తి, కేసముద్రం ఎస్సైలు కరుణాకర్, క్రాంతి కిరణ్ ఘటన స్థలానికి చేరుకొని తండావాసులతో మాట్లాడి సమస్యను కొలిక్కి తీసుకొచ్చారు. అత్యాచారానికి గురైన వృద్ధురాలిని, దాడిలో గాయపడిన బిహారి వ్యక్తిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 48 సంవత్సరాల వయసున్న మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పూర్తిస్థాయిలో దర్యాప్తును పోలీసులు నిర్వహిస్తున్నారు.

Also Read: Mahabubabad District: ఆ పట్టణ కేంద్రంలో వరుస ప్రమాదాలు.. అధికారుల నిర్లక్ష్యమే కారణమా?

Just In

01

Emmanuel: ఇమ్మానుయేల్‌కు ఇంత అన్యాయమా? ఏంటిది బిగ్ బాస్?

Ravi Kiran Kola: విజయ్‌తో ‘రౌడీ జనార్ధన’ ప్రాజెక్ట్ ఎలా ఓకే అయ్యిందంటే?

Bigg Boss House: గ్రాండ్ ఫినాలే అనంతరం.. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో చూశారా? వీడియో వైరల్!

Ponguleti Srinivas Reddy: భూభారతి పోర్టల్‌తో అనుసంధానం.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూస‌మాచారం!

Jupally Krishna Rao: కేసీఆర్‌ కుటుంబ రాజకీయాలే ఆ పార్టీ పతనానికి కారణం : మంత్రి జూపల్లి కృష్ణారావు