Chiranjeevi: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) మార్కెట్‌లోకి వచ్చేశారు అంటే అర్థం కాలేదా? నిజమే, ఆ విషయం మేకర్సే స్వయంగా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో నిత్యం వార్తలలో నిలుస్తోంది. తాజాగా మేకర్స్ మరో అప్డేట్‌ను వదిలారు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతోన్న ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్‌గా
ఈ క్రమంలో తెలుగు స్టేట్స్‌లోని అన్ని థియేటర్లకు ఫొటో కార్డ్స్ వెళ్లిపోయినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ కొన్ని పోస్టర్స్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్స్‌లో చిరంజీవి ‘శంకర్ దాదా MBBS’ అప్పటి లుక్‌ని తలపిస్తుండటం విశేషం. వీటితో పాటు మేకర్స్ సినిమా నుంచి రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి కొత్త స్టిల్ కూడా అదిరిపోయింది. బ్లాక్ సూట్, వైట్ షర్ట్, కళ్లకు డార్క్ గ్లాసెస్‌తో.. ఒక చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న మెగాస్టార్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టిల్ చూసిన మెగాభిమానుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. ఇక మేకర్స్ వదిలిన ఫోటో కార్డ్స్‌లో వెంకీ పోస్టర్ కూడా అదిరిపోయింది. ప్రస్తుతం వచ్చిన ఈ ఫొటో కార్డులతో ఈ సినిమా టైటిల్ మరోసారి ట్రెండ్‌లోకి వచ్చేసింది.
Also Read- Archana Iyer: ‘శంబాల’లో రొమాంటిక్ పాటలు, స్టెప్పులు ఉండవని ముందే చెప్పారు
#MerryChristmas to everyone from team #ManaShankaraVaraPrasadGaru ✨#MSG Photo cards have been dispatched to all theatres across the Telugu states❤️🔥
GRAND RELEASE WORLDWIDE IN THEATRES ON 12th JANUARY 💥
Let’s celebrate SANKRANTHI 2026 with THE BIGGEST FAMILY ENTERTAINER 🥳… pic.twitter.com/jtBPErQZfE
— Shine Screens (@Shine_Screens) December 24, 2025
ఏదో మ్యాజిక్ చేసేలానే ఉన్నారు
ఇప్పటికే భీమ్స్ సిసిరోలియో సంగీతం నుంచి వచ్చిన ‘మీసాల పిల్ల, శశిరేఖ’ పాటలు చార్ట్‌బస్టర్ హిట్స్‌గా నిలిచి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న చిరంజీవి, వెంకటేష్‌పై చిత్రీకరీంచిన పాటని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రాబోతోందని తెలుస్తోంది. దీని కోసం మెగావిక్టరీ ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ పాట తర్వాత ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతాయని టీమ్ చెబుతోంది. మొత్తంగా చూస్తే, ఈ సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఏదో మ్యాజిక్ చేసేలానే ఉన్నారు. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

