Peddi Song: రీసెంట్‌గా ‘దండోరా’ (Dhandoraa) మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో శివాజీ (Sivaji) మాట్లాడిన రెండు పదాలు.. పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. శివాజీ స్పీచ్ మొత్తం మంచిగానే సాగింది కానీ, రెండు అసభ్యకర పదాలతో.. మొత్తం ట్రాక్ మారిపోయింది. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన మాటలపై వెంటనే సారీ చెబుతూ వీడియో విడుదల చేయడమే కాకుండా, మీడియా సమావేశం నిర్వహించి మరోసారి క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా ఈ కాంట్రవర్సీ ఆగడం లేదు. ఇప్పుడు శివాజీకి మద్దతు ఇచ్చే వాళ్లంతా.. ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలను బయటకు తీస్తూ, వారిపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. శివాజీ కూడా తన ప్రెస్ మీట్‌లో.. ‘నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఇంతకు ముందు చాలా మంది ఇలా మాట్లాడారు కదా.. కనీసం సారీ కూడా వాళ్లు చెప్పలేదు.. అప్పుడు ఎక్కడికి పోయారు’ అన్నట్లుగా కౌంటర్స్ ఇచ్చారు.
Also Read- Archana Iyer: ‘శంబాల’లో రొమాంటిక్ పాటలు, స్టెప్పులు ఉండవని ముందే చెప్పారు
చికిరిని చుట్టుకుంటున్న వివాదం
ఇలా అటూ, ఇటూ తిరిగి.. ఇప్పుడీ వివాదం ‘చికిరి’ సాంగ్‌పై పడింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించి విడుదలైన ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri) సాంగ్ ఎలాంటి సెన్సేషన్‌ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అకాడమీ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ఈ పాటలోని లిరిక్‌ని బయటకు తీసి, ఈ సినిమా టీమ్‌కు కూడా నోటీసులు ఇస్తారా? ఈ సాంగ్‌పై కూడా డిబేట్ పెడతారా? అంటూ కొందరు శివాజీ సపోర్టర్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. ఆ లిరిక్‌లో.. ‘దండోరా’ వేడుకలో శివాజీ వాడిన ఓ అసభ్యకర పదం కూడా ఉంది. లిరిక్‌ని గమనిస్తే.. ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక’ అని ఉంది. ఇందులో కూడా సామాను అనే పదం ఉంది కదా.. మరి శివాజీని టార్గెట్ చేసే వాళ్లంతా, ఈ సినిమాపై కూడా దాడి చేయండి అని కౌంటర్స్ ఇస్తున్నారు.
Also Read- Chinmayi Sripada: నీ కొడుకులకు కూడా.. మరోసారి శివాజీకి ఇచ్చిపడేసిన చిన్మయి!
చిరు, బాలయ్య వీడియోలు వైరల్..
పెద్దవాళ్లు అయితే.. కామ్‌గా ఉంటారా? శివాజీ వంటి వారు అయితే మీకు క్షమాపణ చెప్పాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఓ వేడుకలో బాలయ్య (Nandamuri Balakrishna) ‘అమ్మాయి కనిపిస్తే..’ అంటూ మాట్లాడిన వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ‘ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నారు. ఇంటికి వెళితే హాస్టల్ వార్డెన్ అనే ఫీలింగ్ వస్తుంది. ఈసారి అయినా చరణ్‌ని ఒక బాబుని ఇమ్మని అడుగుతున్నాను. లెగసీ కంటిన్యూ అవ్వాలి కదా’ అని మాట్లాడుతున్న వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలానే ఉన్నాయి. మరి అవన్నీ వీళ్లకి ఎందుకు కనిపించడం లేదు? కేవలం శివాజీ మాటల్నే ఎందుకింత సీరియస్‌గా తీసుకున్నారు? ఆ రెండు మాటలు తప్పితే.. మిగతా అంతా శివాజీ మంచే చెప్పాడు కదా? అయినా వీళ్లకి మంచి పనికిరాదు?.. అంటూ ఒకటే కామెంట్స్. చూస్తుంటే, ఈ వివాదం చాలా దూరం వెళ్లేలానే ఉంది. చూద్దాం మరి.. ఈ వివాదం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

