SS Rajamouli: ‘ఛాంపియన్’కు దర్శకధీరుడి ఆశీస్సులు.. పోస్ట్ వైరల్!
Rajamouli and Roshan (image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

SS Rajamouli: ‘ఛాంపియన్’కు దర్శకధీరుడి ఆశీస్సులు.. పోస్ట్ వైరల్!

SS Rajamouli: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ‘ఛాంపియన్’ సినిమానుద్దేశించి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ హీరోస్, డైరెక్టర్స్ అందరూ సపోర్ట్ అందిస్తున్నారు. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి కూడా చిత్రయూనిట్‌‌కు శుభాకాంక్షలు అందజేశారు.

Also Read- Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

ప్రభాస్ ఛాంపియన్ ఎవరంటే..

ఈ సినిమాకు మొదటి నుంచి స్టార్స్ సపోర్ట్ అందిస్తూ వస్తున్నారు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక బ్యానర్ వైజయంతీ మూవీస్ సమర్పిస్తున్న చిత్రం కావడంతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో పాటు తాజాగా ప్రభాస్ కూడా ఈ సినిమాకు సపోర్ట్ అందించారు. సందీప్ కిషన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, సందీప్ రెడ్డి వంగా వంటి వారంతా ‘హు ఈజ్ యువర్ ఛాంపియన్’లో పాల్గొంటూ సినిమాపై మరింతగా హైప్ పెంచారు. ఈ కాంటెస్ట్‌లోకి ప్రభాస్ కూడా యాడయ్యారు. తన ఛాంపియన్ ‘రాజమౌళి’ అని ప్రభాస్ చేసిన పోస్ట్ వైరల్ అవుతున్న క్రమంలో, జక్కన కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో.. ఈ సినిమా సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ రాజమౌళి ఏమన్నారంటే..

Also Read- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పెన్ డ్రైవ్.. ఆధారాలతో ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం!

అర్థవంతమైన సినిమాలు చేస్తూ..

చిత్ర నిర్మాతలైన స్వప్న దత్, ప్రియాంక దత్‌లపై ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాజమౌళి, వీరిద్దరి ప్రయాణం, ఎదుగుదల ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. కొన్ని సంవత్సరాలుగా ఆశయ భరితమైన, కంటెంట్ ఆధారితమైన, అర్థవంతమైన సినిమాలను ప్రోత్సహిస్తూ సినిమాల ప్రమాణాలను ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తున్నారని ప్రశంసించారు. కొత్త తరహా కథల విషయంలో వారి నిబద్ధతను, బలమైన కథలను ధైర్యంగా నమ్మి ముందుకు తీసుకెళ్లే తత్వాన్ని ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించారు. వారి నుంచి రాబోయే ‘ఛాంపియన్’ చిత్రం చాలా ఆసక్తికరంగా ఉందని, ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో వేచి చూస్తున్నానని తెలిపారు. ఇంకా రోషన్, అనస్వర రాజన్, దర్శకుడు ప్రదీప్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Chiranjeevi: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మార్కెట్‌లోకి వచ్చేశారు..

SS Rajamouli: ‘ఛాంపియన్’కు దర్శకధీరుడి ఆశీస్సులు.. పోస్ట్ వైరల్!

Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

KTR: ప్రజలు కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయం.. జలద్రోహాన్ని ఎండగడతాం..కేటీఆర్ ఫైర్!

Archana Iyer: ‘శంబాల’లో రొమాంటిక్ పాటలు, స్టెప్పులు ఉండవని ముందే చెప్పారు