Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పెన్
Phone Tapping Case ( image credit: swetcha reporter)
Telangana News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పెన్ డ్రైవ్.. ఆధారాలతో ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం!

Phone Tapping Case: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ప్రస్తుతం ఓ పెన్​ డ్రైవ్ కీలకంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ప్రభాకర్​ రావు నుంచి స్వాధీనం చేసుకున్న ఈ పెన్ డ్రైవ్ లోని సమాచారం ఆధారంగా సిట్​ విచారణలో జోరును పెంచింది. ప్రస్తుతం కస్టోడియల్ అదుపులో ఉన్న ప్రభాకర్ రావు ఎదుట ఆ వివరాలను పెట్టి దర్యాప్తు అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఫోన్ ట్యాపింగ్​ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఎలాగైనా సరే ఎలక్షన్లలో విజయం దక్కించుకుని హ్యాట్రిక్​ సాధించాలని బీఆర్​ఎస్ ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నాయకులతోపాటు వారితో పరిచయాలు ఉన్న పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారుల ఫోన్లను ట్యాప్​ చేయించినట్టుగా బలమైన ఆరోపణలు వచ్చాయి. దాంతో కాంగ్రెస్​ ప్రభుత్వం ఫోన్​ ట్యాపింగ్ పై సిట్​ విచారణకు ఆదేశించింది.

వెలుగు చూడగానే

కాగా, ఫోన్ ట్యాపింగ్​ లో కీలకంగా వ్యవహరించిన ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు దీని కోసం ఎస్​ఐబీ కార్యాలయంలో రెండు గదులతో ప్రత్యేక వార్ రూంను ఏర్పాటు చేసుకున్నట్టుగా దర్యాప్తులో తేలింది. అయితే, చేసిన నిర్వాకం బయట పడగానే ప్రణీత్ రావు వార్ రూంలోని కంప్యూటర్లకు సంబంధించిన హార్డ్​ డిస్కులతోపాటు ఇతర డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేశాడు. కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్కులను ముక్కలు ముక్కలుగా చేసి నాగోల్ వద్ద మూసీ నదిలోకి విసిరేశాడు. తన పర్సనల్ మొబైల్ ఫోన్లలో ఉన్న డేటాను కూడా ఎరేజ్​ చేశాడు. మరోవైపు కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్​ఐబీ మాజీ ఛీఫ్​ ప్రభాకర్​ రావు అమెరికా పారిపోయాడు. ఆ తరువాత ప్రభాకర్​ రావు కూడా తన మొబైల్ ఫోన్లను ఫార్మాట్ చేయటం ద్వారా వాటిల్లో ఉన్న సమాచారన్ని ఎరేజ్​ చేశాడు. క్లౌడ్​ లో ఉన్న సమాచారాన్ని కూడా తుడిచేశాడు. అయితే, పాస్​ పోర్టును రద్దు చేయించటం ద్వారా ప్రభాకర్ రావును వెనక్కి రప్పించిన సిట్​ అధికారులు ఆయన నుంచి ఓ పెన్ డ్రైవ్​ ను స్వాధీనం చేసుకోగలిగారు.

Also Read: Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?

సిట్ అధికారులు దర్యాప్తు

ప్రస్తుతం విచారణలో ఆ పెన్ డ్రైవ్​ అత్యంత కీలకంగా మారింది. విశ్వసనీంగా తెలిసిన ప్రకారం పెన్​ డ్రైవ్​ నుంచి వందలకొద్ది ఫోన్​ నెంబర్లను విచారణాధికారులు సేకరించినట్టు సమాచారం. వీరిలో రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జిల నెంబర్లతోపాటు వారి ప్రొఫైల్స్​ కూడా పెన్​ డ్రైవ్​ ద్వారా దర్యాప్తు అధికారుల చేతికి చిక్కినట్టుగా తెలియవచ్చింది. ప్రభాకర్ రావు…ఆయన టీం చాలావరకు డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసినా ఈ పెన్​ డ్రైవ్​ నుంచి తెలిసిన వివరాల ఆధారంగా ప్రస్తుతం సిట్ అధికారులు దర్యాప్తు అధికారులను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మావోయిస్టులు, ఉగ్రవాదులు…వారి సానుభూతిపరుల ఫోన్లను మాత్రమే ట్యాప్ చేయాల్సి ఉండగా రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తల నెంబర్లను ఎందుకు ట్యాప్​ చేశారని సేకరించిన వివరాలను ముందు పెట్టి నిశితంగా ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసింది.

ఫోన్​ ట్యాపింగ్​ లో సూత్రధారులు ఎవరు 

అయితే, ఆధారాలను ఎదురుగా పెట్టి విచారణ చేస్తున్నా ప్రభాకర్​ రావు మాత్రం ఫోన్​ ట్యాపింగ్​ లో సూత్రధారులు ఎవరన్నది మాత్రం బయట పెట్టటం లేదని సమాచారం. నేను ఎవరెవరి నెంబర్లను ట్యాప్​ చేయించానో..ఆ సమాచారం అంతా నా పై అధికారులు, రివ్యూ కమిటీ సభ్యులకు తెలుసని మాత్రమే అంటున్నట్టుగా తెలిసింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్​ వ్యవహారం జరిగిందన్నది నిరూపించటానికి ఈ పెన్ డ్రైవ్ ఆధారం సరిపోతుందని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈనెల 26వ తేదీ వరకు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ జరిపే అవకాశం ఉండటంతో ఈ రెండు రోజుల్లో కీలక వివరాలను కక్కించాలని చూస్తున్నారు.

Also Read: Phone Tapping Case: ఫోన్​ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ.. ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం.. కానీ!

Just In

01

KTR: ప్రజలు కాంగ్రెస్‌ను బొందపెట్టడం ఖాయం.. జలద్రోహాన్ని ఎండగడతాం..కేటీఆర్ ఫైర్!

Archana Iyer: ‘శంబాల’లో రొమాంటిక్ పాటలు, స్టెప్పులు ఉండవని ముందే చెప్పారు

Thummala Nageswara Rao: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Chinmayi Sripada: నీ కొడుకులకు కూడా.. మరోసారి శివాజీకి ఇచ్చిపడేసిన చిన్మయి!

Sudheer Babu: మైనర్లకు మందు అమ్మినా… సరఫరా చేసినా కఠిన చర్యలు : రాచకొండ సీపీ సుధీర్​ బాబు