ACB Raids: ఖమ్మం డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏసీబీ(ACB) డిఎస్పి వై.రమేష్(Y. Ramesh) ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గత కొద్ది కాలంగా ఆర్టీవో(RDO) కార్యాలయాల్లో ఏసీబీ విస్తృత తనిఖీలను చేపట్టడంతో పాటు వివిధ రకాల ట్రాన్సాక్షన్లపై నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తున్నారు. వరంగల్(Warangal) ఏసీబీ డిఎస్పి పై వచ్చిన ఆరోపణలపై విచారణ తో పాటు మిగతా జిల్లాల ఏసీబీ డీఎస్పీ లపై ఏసీబీ ఉన్నతాధికారులు స్పష్టమైన నిఘా పెట్టడంతోపాటు కిందిస్థాయి అధికారులతో పాటు సిబ్బందిపై కూడా స్పష్టమైన నిఘాను పెట్టి పర్యవేక్షణ చేస్తున్నారు.
లైసెన్సులకు సంబంధించి
ఈ నేపథ్యంలోనే ఖమ్మం(Khammam) ఆర్టీవో(RDO) కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ(Venkataramana) పై పలు విధాలుగా వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ(ACB) అధికారులు దృష్టి సారించి రూ.70000 లను వివిధ ఏజెంట్ల ద్వారా తీసుకున్న క్రమంలో ఏసీబీ అధికారులు సస్పెక్ట్ తనిఖీలను నిర్వహించారు. ఈ దాడుల్లో వివిధ రకాల లైసెన్సులకు సంబంధించి ఏజెంట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణకు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు.
Also Read: Telangana BJP: మోదీ చివాట్లతో బీజేపీ నేతల్లో మార్పు.. డిన్నర్ మీటింగ్ వెనుక రహస్యం అదేనా?
స్పష్టమైన సమాచారంతో తనిఖీలు
దీంతో వివిధ రకాల ఏజెంట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ కు డబ్బులు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు స్పష్టమైన సమాచారంతో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ దగ్గర రూ.70000 నగదు ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై రమేష్ స్పష్టతను ఇచ్చారు. ఇంకా పూర్తిస్థాయిలో విచారణ జరిగిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
Also Read: Farmer Death: దౌల్తాబాద్‌లో దారుణం.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి!

