CM Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. 2029లో 80 శాతానికి పైగా సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నంతకాలం.. కల్వకుంట్ల కుటుంబాన్ని పవర్ లోకి రానివ్వనని సీఎం రేవంత్ శపథం చేశారు. బీఆర్ఎస్, కేసీఆర్ గతమన్న సీఎం.. భవిష్యత్ అంతా కాంగ్రెస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. ఆస్తుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందనే సొంత బిడ్డను, అల్లుడ్ని కేసీఆర్ వెళ్లగొట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
‘2029లో 80కి పైగా గెలుస్తాం’
సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించారు. కాంగ్రెస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్ లను సీఎం సన్మానించారు. అనంతరం సభలో మాట్లాడుతూ విపక్ష బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 119 సీట్లు ఉండగా 2029 ఎన్నికల్లో 80కి పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ నియోజకవర్గ పునర్విభజన జరిగి 150కి సీట్లు పెరిగితే 100కి పైగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని స్పష్టం చేశారు. చంద్రశేఖర్ రావు, హరీశ్ రావు, దయాకర్ రావు సహా బీఆర్ఎస్ రావులంతా ిది పెట్టుకోండి అంటూ సీఎం సవాలు విసిరారు. తాను ఉన్నంత వరకూ బీఆర్ఎస్ ను అధికారంలోకి రానివ్వనని పేర్కొన్నారు.
కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
2029 ఎన్నికల్లో 2/3 సీట్లతో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
చేతనేతే కాసుకో బిడ్డా
నేను రాజకీయం చేసినంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను
కొడంగల్ బిడ్డగా ఇదే నా శపథం
– సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/1fZcKPPTeC
— BIG TV Breaking News (@bigtvtelugu) December 24, 2025
Als0 Read: Kohli Rohit: వారెవ్వా.. శతక్కొట్టిన రోహిత్, విరాట్.. దేశవాళీ క్రికెట్‌లోనూ పరుగుల వరద
‘నువ్వెంత.. నీ స్థాయెంత?’
అంతేకాదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘నువ్వెంత.. నీ స్థాయెంత?’ అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. ఆస్తి కోసం సొంత చెల్లినే మెడలు పట్టుకొని బయటకు నెట్టావ్. ఆమెకే సమాధానం చెప్పలేని వ్యక్తివి నాకు సవాల్ విసురుతావా?. నీ అవ్వా.. లాగులో తొండలు విడిచి కొడతా బిడ్డా. మీ నాయన్ను అడుగు నా గురించి చెబుతారు. అమెరికాలో బాత్రూమ్ లు కడిగినట్టు అనుకున్నావా? నాతో మాట్లాడటమంటే’ అని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘అసెంబ్లీలో చర్చిద్దాం రా’
బీఆర్ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమేని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ సాక్షిగా ఇదే తన శపథం అని పేర్కొన్నారు. ‘పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడు కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా. ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధం. సభకు రండి.. అర్థవంతమైన చర్చ చేద్దాం. కాళేశ్వరంపై చర్చిద్దామా, కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దాం, టెలిఫోను ట్యాపింగ్ పై చర్చిద్దామా రండి. సొంత చెల్లిలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళింటి ఆడబిడ్డనే చెబుతోంది. సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నాడు. మీ గ్రాండ్రిపులకు, బెదిరింపులకు భయపడేది లేదు. తోలు తీసుడు కాదు.. మీ తోలు సంగతి చూసుకోండి’ అని రేవంత్ అన్నారు.
సర్పంచ్‌లకు శుభవార్త
అంతకుముందు కొడంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ‘కొడంగల్ వేదికగా 12706 మంది సర్పంచులకు సూచన చేస్తున్నా. చిన్న గ్రామాలకు రూ. 5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ అందిస్తా. ముఖ్యమంత్రి నిధుల నుంచి నేరుగా సర్పంచులకే ఫండ్ అందిచే బాధ్యత నాది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులకు ఇది అదనం. సర్పంచుల గౌరవం పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

