Thorrur Mandal: ఓ చిన్న బాట పంచాయతీ చిలికి చిలిక గాలి వానగా మారింది. మాట మాట పెరిగి రాళ్లు, కర్రలతో దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. అది కూడా నడి రోడ్డు మీద ఛేజ్ చేస్తూ ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణం నడిరోడ్డుపై విపరీతమైన హంగామా జరిగింది. సినిమా రేంజ్‌లో జరిగిన గ్రూప్ ఫైట్‌తో నడిరోడ్డు యుద్ధభూమిగా మారింది. తొర్రూరు మండలం జీకే తండాకు చెందిన భద్రమ్మ, రమేశ్ కుటుంబాల మధ్య బాట పంచాయతీ విషయంలో ఏర్పడిన వివాదం ఈ హింసాత్మక ఘటనకు దారితీసింది. రహదారిపై పరిగెత్తుకుంటూ రాళ్లు, కర్రలు విసురుకుంటున్న దృశ్యాలు ప్రజల్లో భయాందోళన రేపాయి. స్థానికులు ఈ ఘర్షణను చూస్తూ భయంతో పరుగులు తీశారు.
బాట వివాదం..
తొర్రూరు మండలం జీకే తండాకు చెందిన భద్రమ్మ, రమేశ్ కుటుంబాల మధ్య కొంతకాలంగా బాట (దారి) పంచాయతీ కొనసాగుతోంది. ఈ విషయంలో మంగళవారం ఉదయం వాగ్వాదం తారాస్థాయికి చేరింది. మాట మాట పెరిగి, రమేశ్ కుటుంబసభ్యులు గొడ్డలితో భద్రమ్మపై దాడి చేశారు. ఆమె తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో మరో రౌండ్ దాడులు!
భద్రమ్మను ఆస్పత్రికి తీసుకెళ్లగానే, అక్కడికి రమేశ్ కుటుంబ సభ్యులు చేరుకుని మరోసారి ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. కొందరు కర్రలు పట్టుకుని తలుపులు పగలగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు.
Also Read: CM Revanth on Betting Apps: బెట్టింగ్ యాప్స్ ఆగడాలపై సీఎం రేవంత్ కన్నెర్ర.. అసెంబ్లీలో కీలక ప్రకటన
పోలీసుల రంగప్రవేశం.. కేసు నమోదు
ఇది తెలియగానే తొర్రూరు పోలీసులు భారీ బలగాలతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇరు కుటుంబాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాదానికి కారణమైన బాట పంచాయతీపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
Dogs Cry at Night: కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయి.. ఇది శుభమా.. ? అశుభమా?
Case on Bandi Sanjay: బండి సంజయ్ కు ఊహించని ఝలక్.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు!