onions ( Image Source: Twitter)
Viral

Spring Onions Benefits: ఉల్లికాడ‌ల‌ వలన ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Spring Onions Benefits: మనం చేసుకునే వంటల్లో కరివేపాకు, కొత్తిమీర వాటిని ఎలా వాడుతామో అలాగే ఉల్లి కాడలను కూడా వేసుకుంటాము. ఎందుకంటే, ఇవి రుచికి సుగంధాన్ని జోడిస్తాయి. అంతేకాదు, ఈ కాడల్లో పోషకాలు ఎక్కువగాఉంటాయి. అవి మనల్ని అన్ని సమయాల్లో కాపాడుతాయి. అయితే, వీటితో పాటు మనలో కొందరు ఉల్లికాడలను కూడా కూరల్లో, చారులో, పచ్చళ్లలో వేసుకుంటారు. ఉల్లికాడలు వంటకాలకు రుచి, వాసన జోడించడమే కాదు, ఆరోగ్యానికి కూడా సూపర్ బెనిఫిట్స్ ఇస్తాయి. వీటిని రెగ్యులర్‌గా మన డైట్‌లో చేర్చుకుంటే ఎన్నో జబ్బులను తగ్గించి, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. ఈ ఉల్లికాడలు మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయో తెలుసుకుందాం..

Also Read: Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

స్కిన్‌కి సూపర్ కేర్..

వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఇది రోగ నిరోధక శక్తిని స్ట్రాంగ్ గా చేస్తుంది. దీంతో శరీరం ఇన్ఫెక్షన్లు, సీజనల్ జబ్బులైన జలుబు, దగ్గును సులభంగా ఎదుర్కొంటుంది. అంతేకాదు, విటమిన్ సి కొల్లాజెన్ ప్రొడక్షన్‌ని బూస్ట్ చేసి, స్కిన్‌ని యంగ్, గ్లోయింగ్‌గా ఉంచుతుంది. ముడతలు, మచ్చలు తగ్గి, చర్మం బ్రైట్‌గా కనిపిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. ఇంకా, విటమిన్ కె ఉల్లికాడల్లో సమృద్ధిగా ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా సాయపడుతుంది, బ్లీడింగ్‌ని కంట్రోల్ చేస్తుంది. అలాగే, ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది, ఆస్టియోపొరోసిస్ లాంటి సమస్యలను తగ్గిస్తుంది.

Also Read: Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

గుండె, కళ్లు, క్యాన్సర్ ప్రొటెక్షన్

ఈ ఉల్లి కాడల్లో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది కంటి చూపును మెరుగుపరస్తుంది. అంతేకాదు, కళ్ల హెల్త్‌ని కాపాడుతుంది. ఫ్లేవనాయిడ్స్, సల్ఫర్ కాంపౌండ్స్ ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కట్టడి చేస్తాయి. శరీరంలో ఇన్‌ఫ్లామేషన్ తగ్గుతుంది, ప్రమాదకర జబ్బులను దూరం చేస్తుంది. ముఖ్యంగా, ఆల్లియం అనే కాంపౌండ్ క్యాన్సర్ కణాలను నాశనం చేసి, క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది.

Also Read: Alcohol Addiction: ఆకలితో ఉన్నప్పుడు బాటిల్స్ మీద బాటిల్స్ మద్యం సేవిస్తున్నారా.. బయట పడ్డ షాకింగ్ నిజాలు

అందుకే ఉల్లికాడలు మస్ట్ గా తీసుకోండి!

ఉల్లికాడలు కేవలం వంటకాలకు ఫ్లేవర్ యాడ్ చేయడమే కాదు, ఆరోగ్యానికి అదిరిపోయే బెనిఫిట్స్ ను కూడా ఇస్తాయి. కూరల్లో, చారులో, సలాడ్స్‌లో ఈ గ్రీన్ సూపర్‌ఫుడ్‌ను చేర్చుకోండి. రుచితో పాటు ఫిట్‌నెస్ కూడా మీ సొంతమవుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Just In

01

Chiranjeeva Trailer: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేత సుడిగాలి పర్యటన.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Sreeleela: పెళ్లి తర్వాత అలాంటి పాత్రలే ఎక్కువ చేస్తా.. వైరల్ అవుతున్న శ్రీలీల బోల్డ్ కామెంట్స్

Telangana: ‘దూపదీప నైవేథ్యం’ స్కీమ్‌.. ఆలయాల నుంచి భారీగా దరఖాస్తులు.. అధికారుల మల్లగుల్లాలు!

Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ అప్డేట్.. వీడియో వైరల్