Telugu States Disasters 2025: 2020 నుంచి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలీడం లేదు. కంటికి కూడా కనిపించని ఒక చిన్న జీవి కొన్ని లక్షల ప్రాణాలను తీసుకెళ్లింది. అక్కడ నుంచి మొదలుకుని ప్రతి యేటా ఎన్నో ఎన్నో ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి. గడిచిన నాలుగేళ్ళలో ఈ 2025 లో అయితే మరీ దారుణం.. ఎప్పుడూ లేని విధంగా వర్షాలు, వరదలు, బస్ ఫైర్ అక్సిడెంట్ లు, ఫ్యాక్టరీ ఫైర్ లు, రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఒకటి కాదు, చాలానే జరిగాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో కూడా అర్థం కావడం లేదు. అయితే, కొందరు మనుషులు చేసే పాపాల వలనే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. పాపాలు తగ్గితే వినాశానాలు కూడా ఆగుతాయని అంటున్నారు.
విషాదకరమైన సంవత్సరంగా మారిన 2025
2025 సంవత్సరంలో ఎన్నడూ లేని వర్షాలు కురిశాయి. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు భయానకమైన ఏడాదిగా మారింది. సహజ విపత్తులు, రోడ్డు ప్రమాదాలు, పారిశ్రామిక విస్ఫోటాలు, మానవ సృష్టి ఆపదలు కలిసి వందలాది జీవితాలను బలిగొట్టాయి. జనవరి నుండి అక్టోబర్ 2025 వరకు మాత్రమే మొత్తం మరణాలు 300కి పైగా నమోదయ్యాయి. మాన్సూన్ సీజన్‌లో వరదలు, ల్యాండ్‌స్లైడ్‌లు మరింత దెబ్బతీశాయి.
1. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ స్టాంపేడ్ (జనవరి 8, 2025) ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భయంకరమైన స్టాంపేడ్. లక్షలాది మంది ఒకేసారి రావడంతో క్రౌడ్ మేనేజ్‌మెంట్ విఫలంతో 6 మంది మరణించారు, 20 మంది గాయపడ్డారు. ఇదే ఈ ఏడాది మొదటి పెద్ద విషాదకర ఘటన.
2. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ బోట్ ఫైర్ (జనవరి 26, 2025) తెలంగాణలోని హైదరాబాద్‌లో ‘భారత్ మాతా మహా ఆరతి’ కార్యక్రమంలో ఫైర్‌క్రాకర్లు పేలి రెండు బోట్లపై మంటలు. 22 ఏళ్ల గణపతి (ఆంధ్రప్రదేశ్ నివాసి) మరణించాడు, మరికొందరు గాయపడ్డారు. ఇది ఈ నెలలోనే 50కి పైగా ఫైర్ యాక్సిడెంట్లలో ఒకటి.
3. చెర్లపల్లి శేష సాయి కెమికల్ ఫ్యాక్టరీ ఫైర్ (ఫిబ్రవరి 4, 2025)తెలంగాణలోని హైదరాబాద్ చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో శేష సాయి కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్ డ్రమ్స్ పేలి భారీ ఫైర్. 5 మంది మరణించారు, 15 మంది గాయపడ్డారు. మానవ లోపాలు, షార్ట్ సర్క్యూట్‌లు కారణం.
4. ఖమ్మం టక్కెళ్లపాడు రోడ్డు ప్రమాదం (ఏప్రిల్ 2025)తెలంగాణలోని ఖమ్మం జిల్లా టక్కెళ్లపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ నివాసులైన ఒక దంపతి మోటర్‌బైక్‌పై ప్రయాణిస్తూ లారీతో కలిసి ప్రమాదం. ఇద్దరూ మరణించారు.
5. నాగర్‌కర్నూల్ శ్రీసైలం లెఫ్ట్ బ్యాంక్ కాల్ కోలాప్స్ (మే 2025)తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో శ్రీసైలం లెఫ్ట్ బ్యాంక్ కాల్ (నీటి చానల్) కూలిపోవడంతో 8 కార్మికులు మిస్సింగ్. నిర్మాణ లోపాలు, వర్షాలు కారణం. రెస్క్యూ ఆపరేషన్లు రోజులు పడ్డాయి.
6. సిగాచి ఇండస్ట్రీస్ పాషమైలారం విస్ఫోటం (జూలై 2025) తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలోని పాషమైలారం సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో డ్రయర్ యూనిట్ పేలి భారీ విస్ఫోటం. 46 మంది కార్మికులు మరణించారు, 8 మంది మిస్సింగ్.
7. ఆంధ్ర-తెలంగాణ వరదలు ( మే 2025)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు. 33 మంది మరణించారు.
8. కర్నూల్ బస్ ఫైర్ ఆక్సిడెంట్ (అక్టోబర్ 24, 2025)
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లాలో ఘోర ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది. 19 మంది మరణించారు (తెలంగాణ నుండి 6, ఆంధ్ర నుండి 12, మిగతా 1). 43 మందిలో 10 మంది బయట పడ్డారు. ఓవర్‌స్పీడ్, నిర్లక్ష్యం కారణాలు. రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సానుభూతి తెలిపారు.
