Health ( Image Source: Twitter)
Viral

Alcohol Addiction: ఆకలితో ఉన్నప్పుడు బాటిల్స్ మీద బాటిల్స్ మద్యం సేవిస్తున్నారా.. బయట పడ్డ షాకింగ్ నిజాలు

Alcohol Addiction: సంతోషంగా ఉన్నా.. బాధలో ఉన్నా.. చాలామంది మందు తాగుతుంటారు. కొందరు ఆకలితో కడుపు ఖాళీగా ఉన్నప్పుడు కూడా మద్యం తాగేస్తారు. కానీ,  ఈ  మందు తాగడం ఆరోగ్యానికి బాగా హానికరమని డాక్టర్లు గట్టిగా చెబుతున్నారు. మద్యానికి లొంగిపోయిన వాళ్లు భోజనం ముందు కూడా మందు తాగి, ఆ తర్వాతే భోజనం తీసుకుంటారు. కానీ, ఆకలిగా ఉన్నప్పుడు మద్యం తాగితే అది నేరుగా కడుపులోకి చేరి, శరీరంలో చక్కర్లు కొడుతుంది.

Also Read: Australia Cricketers: ఆసీస్ మహిళా క్రికెటర్లను వేధించిన నిందితుడి మక్కెలు విరగ్గొట్టిన పోలీసులు.. వీడియో ఇదిగో

ఆకలితో ఉన్నప్పుడు మద్యం తాగడం మంచిదేనా? 

ఖాళీ కడుపుతో మందు తాగితే, అది అన్నవాహిక ద్వారా కడుపులోకి దూసుకెళ్లి, రక్తంలోకి ఒక్కసారిగా కలిసిపోతుంది. దీనితో తల తిరగడం, మాటలు నీటిగా రాకపోవడం, స్పష్టంగా మాట్లాడలేకపోవడం లాంటి ఇబ్బందులు వస్తాయి. కొందరికి వాంతులు, విరేచనాలు కూడా తప్పవు. మద్యం తలకు తొందరగా ఎక్కేస్తే, కళ్లు తిరిగి, ఒళ్లు జల్లుమనడం లాంటివి ఎదురవుతాయి. ఇంకా చూస్తే, ఖాళీ కడుపుతో మందు తాగితే అది శరీరంలో విషంలా పాకి, గుండె సమస్యలు, జీర్ణక్రియ దెబ్బతినడం, కడుపులో మంట, ఉబ్బరం లాంటి గొడవలు తప్పవు.మద్యం ఆరోగ్యానికి విషమని అందరూ గొంతు చించుకుని చెప్పినా, మందుబాబులు మాత్రం తాగడం ఆపే ప్రసక్తే లేదు. ఖాళీ కడుపుతో తాగడం అంటే మరింత డేంజర్.

Also Read: Story vs star power: బిగ్ స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలకు ‘కాంతార చాప్టర్ 1’ చెప్తోంది ఇదేనా?.. హిట్ ఫార్ములా ఏంటంటే?

ఇలా చేస్తే మద్యం శరీరంలో విషంలా చొచ్చుకుపోయి, గుండె జబ్బులు, కాలేయం పాడవడం లాంటి పెద్ద పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ రోజుల్లో మద్యానికి బానిసలై, కాలేయం చెడిపోయి, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ల సంఖ్య చిన్నది కాదు. అందుకే, ఆకలితో మందు తాగడం బొత్తిగా మంచిది కాదు. ఆరోగ్యం కాపాడుకోవాలంటే, మద్యానికి దూరంగా ఉండడమే బెస్ట్.

Also Read:  Warangal Gurukulam: గురుకులంలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. అధికారాల తీరుపై స్థానికుల ఆగ్రహం!

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించి మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..