Australia Cricketers: ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఇండోర్‌లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులోని ఇద్దరు క్రికెటర్లు (Australia Cricketers) గురువారం వేధింపులకు గురైన షాకింగ్ విషయం తెలిసిందే. అక్వీల్ ఖాన్ అనే ఓ వ్యక్తి.. ఓ క్రికెటర్‌ను అసభ్యకరమైన ప్రదేశంలో తాకాడు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితుడు అక్వీల్ గుర్తించి, తమదైన శైలిలో గట్టిగా బుద్ధి చెప్పారు. దీంతో, అతడి కుడి కాలు, ఎడమ చెయ్యి డ్యామేజ్ అయ్యాయి. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. నిందితుడు అక్విల్ నడవలేని స్థితిలో, పోలీసుల సాయంతో కుంటుతూ ఈ వీడియోలో కనిపించాడు.
కాగా, ఈ వ్యవహారం భారత్‌లో సేఫ్టీ, దేశ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కావడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడు అక్వీన్ ఖాన్‌ను అరెస్టు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నిందితుడిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నందున, చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే, నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం (NSA) కింద కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్థానిక బీజేపీ ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు ఈ మేరకు నినాదాలు చేశారు.
Meet Aqueel Khan, a Congress voter, arrested for harassing Australian women cricketers in Indore.
Such people are a disgrace to our country and its values…. pic.twitter.com/kATiOzAi4c
— Mr Sinha (@MrSinha_) October 25, 2025
ప్రస్తుతం అక్వీల్ ఖాన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న అదనపు డీసీపీ (క్రైమ్ బ్రాంచ్) రాజేష్ దండోటియా మాట్లాడుతూ, నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని, అన్ని వివరాలు పూర్తిగా పరిశీలిస్తున్నామని తెలిపారు. న్యాయస్థానంలో కఠినమైన శిక్ష పడేందుకు అవసరమైన అన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నామని వివరించారు. మరోవైపు, ఈ ఘటన జరిగిన నేపథ్యంలో, ఇండోర్‌లో అంతర్జాతీయ క్రీడాకారుల భద్రతా ఏర్పాట్లలో ఉన్న లోపాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సమీక్ష జరిపిన పోలీస్ కమిషనర్ సంతోష్ సింగ్, ఇంటెలిజెన్స్ వింగ్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also- Thummala Nageswara Rao: పత్తికొనుగోళ్లపై పర్యవేక్షణ చేయాలి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు
తక్షణ చర్యగా హోల్కర్ స్టేడియం చుట్టూ, ముఖ్యంగా టీమ్ హోటల్ నుంచి స్టేడియం వరకు ఉన్న మార్గంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. టీమ్ కదలికలకు పూర్తిస్థాయిలో భద్రతా ఎస్కార్ట్‌ను తప్పనిసరి చేశారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (MPCA) కూడా స్పందిస్తూ, ప్లేయర్లు వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు ఉండాల్సిన భద్రతా ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
మొదలైన రాజకీయం
ఆసీస్ మహిళా క్రికెటర్లకు వేధింపుల వ్యవహారం నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు మొదలయ్యాయి. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సహా పలువురు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శలు గుప్పించారు. దీనికి సమాధానంగా, కేబినెట్ మంత్రి కైలాష్ విజయవర్గీయ స్పందిస్తూ, ఇది భారతదేశ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారమని అన్నారు. నేరస్తుడికి తప్పకుండా శిక్ష పడేలా చూస్తామని హామీ తెలిపారు.
Read Also- Star Heroines: ఈ స్టార్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారు.. రీ ఎంట్రీలో నిలబడతారా?
