Star Heroines: ఒకప్పుడు టాలీవుడ్ తెరను తమ అందం, అభినయంతో ఏలిన స్టార్ హీరోయిన్లు.. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుండడం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. కొన్నాళ్లుగా కొత్త హీరోయిన్ల హవా నడుస్తున్న సమయంలో, పాతతరం దిగ్గజాలు తమ సత్తా చాటేందుకు తిరిగి వస్తుండటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా త్రిష (Trisha), నయనతార (Nayanthara), కీర్తి సురేష్ (Keerthi Suresh), పూజా హెగ్డే (Pooja Hegde), సమంత (Samantha) వంటి అగ్రతారలు ప్రకటించిన కొత్త ప్రాజెక్టులు టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ రీ ఎంట్రీల పరంపరలో సీనియర్ నటి త్రిష, ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’తో దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరంజీవితో జోడీ కడుతూ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. గతంలో ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి హిట్‌లతో అలరించిన త్రిష, ఈ మెగా ప్రాజెక్ట్‌తో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను పటిష్టంగా ప్రారంభించాలని చూస్తున్నారు.
Also Read- Australia Cricketers: ఇండోర్‌లో షాకింగ్ ఘటన.. ఆసీస్ మహిళా క్రికెటర్లను అసభ్యకరంగా తాకిన ఆకతాయి
రీ ఎంట్రీకి సిద్ధమైన భామలు వీరే..
అదేవిధంగా, ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార కూడా చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ‘సైరా’ తర్వాత వీరిద్దరి కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. మధ్యలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి సోదరిగా ఆమె నటించారు. మరోవైపు, ‘మహానటి’తో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్, విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్థన్’తో, బుట్టబొమ్మ పూజా హెగ్డే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రాజెక్ట్‌తో తిరిగి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. వీరితో పాటు, అనారోగ్యం నుండి కోలుకున్న సమంత, తను నటిస్తూ, నిర్మిస్తున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’తో శక్తివంతమైన గృహిణి పాత్రలో కనిపించబోతున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సమంతకు వ్యక్తిగతంగా కూడా ఎంతో కీలకం.
Also Read- Megastar Chiranjeevi: ఇకపై చిరంజీవి పేరు, ఫొటోలను ఎలా పడితే అలా వాడారో..!
నిలబడతారా..
గతంలో రీ ఎంట్రీ ఇచ్చిన కొందరు సీనియర్ హీరోయిన్లకు ఆశించిన విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో, ఈ స్టార్ హీరోయిన్స్ అంతా ఒకేసారి రంగంలోకి దిగుతున్న ఈ తరుణం అత్యంత ఉత్కంఠగా మారింది. మంచి కథలను, బలమైన పాత్రలను ఎంచుకున్న ఈ భామలు, తమ అనుభవం, స్టార్‌డమ్‌తో టాలీవుడ్‌లో మళ్లీ తమ హవా కొనసాగించగలుగుతారా? లేక రెండు మూడు సినిమాలకే పరిమితమై, మళ్లీ పక్కకు తప్పుకుంటారా? అనేది వారి రాబోయే చిత్రాల విజయంపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా, ఈ స్టార్ హీరోయిన్ల దండయాత్ర తెలుగు సినీ పరిశ్రమకు మరింత గ్లామర్, డిమాండ్‌ని తీసుకురావడం మాత్రం ఖాయం. చూద్దాం ఏం జరుగుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
