Harish Rao (Image Source: Twitter)
తెలంగాణ

Harish Rao: ఆటో డ్రైవర్లు అంటే పట్టదా.. హమీ ఇచ్చి పట్టించుకోరా.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

Harish Rao: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి బుద్ది వస్తుందని బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆటో డ్రైవర్లకు అండగా బీఆర్ఎస్ (BRS) తలపెట్టిన పోరుబాటలో భాగంగా హరీశ్ రావు ఆటోలో ప్రయాణించారు. ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ వరకూ ఆటోలో వెళ్లారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల పక్షాన హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.12,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రెండేళ్లకు గాను బకాయి పడ్డ రూ.24వేలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

‘161 ఆటో కార్మికులు చనిపోయారు’

రాష్ట్రంలోని ఆటో కార్మికులకు రెండేళ్ల బకాయిలు చెల్లించడానికి రూ.1500 కోట్లు ఖర్చు అవుతుందని హరీశ్ రావు అన్నారు. ‘రూ.3 లక్షలు ఫీజు పెంచితే మద్యం టెండర్లపై రూ.3,000 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. అందులో నుంచి రూ.1500 కోట్లు ఆటో కార్మికులకు ఇచ్చి ఆటో కార్మికులను కాపాడాలని మా డిమాండ్. ఇప్పటివరకు 161 ఆటో కార్మికులు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. ఆటో కార్మికులు ఎవరూ చనిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గురువు (సీఎం చంద్రబాబు) ఆంధ్ర ప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తున్నారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లందరికీ బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంది’ అని హరీశ్ రావు అన్నారు.

ఆటో డ్రైవర్ రమేష్ మాట్లాడుతూ..

అంతకుముందు ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ నుంచి ఆటోలో తెలంగాణ భవన్ కు హరీశ్ రావు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ రమేష్.. హరీశ్ రావుతో తమ బాధలను చెప్పుకున్నారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ల జీవితం బాగుండేది. రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం పెట్టి ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టాడు. ఆటో డ్రైవర్లు అప్పుల బాధతో చనిపోతున్నారు. వారి కుటుంబాలు దిక్కులేని వారు అవుతున్నారు. హరీష్ రావు మా అందరి కోసం వచ్చి మాకు సంఘీభావంగా ఆటోలో ప్రయాణించారు. రోజుకి రూ. 500 రూపాయలు ఇప్పుడు వస్తున్నాయి. గతంలో రోజుకు రూ.1500 – 2,000 వరకూ వచ్చేవి. సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ.12,000 ఇస్తామని చెప్పి మోసం చేసింది.

Also Read: Tragedy Love Story: ఐదు రోజుల్లో పెళ్లి.. ప్రియురాలిని మింగేసిన గోదావరి.. లవ్ స్టోరీలో తీవ్ర విషాదం

ఆడవారికి ఫ్రీ.. మగవారికి డబుల్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు ఆందోళనలో ఉన్నారని హరీశ్ రావు విమర్శించారు. రైతులు, చిరు ఉద్యోగులు, మహిళలు, ఆటో డ్రైవర్లు ఇలా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని పునరుద్ఘటించారు. ‘పేరుకే ఉచిత బస్సు అన్నారు. ఆడవారికి ఫ్రీ అని చెప్పి.. మగవారికి టికెట్ ధరలను డబుల్ చేశారు. టికెట్ రేట్లు పెంచి కుటుంబం మీద భారం వేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదుసార్లు బస్ చార్జీలు పెంచింది. ఆటో డ్రైవర్లంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకంత చిన్నచూపు. ఓట్ల కోసం ఆటో ఎక్కి తిరిగావు. ఇప్పుడు ఆటో కార్మికుల కష్టాలు పట్టడం లేదా? నెలకు రూ.1000 ఇవ్వడానికి కూడా పైసలు లేవా?’ అని ప్రశ్నించారు.

Also Read: Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

Just In

01

Bigg Boss 9 Telugu: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. ఎందుకు డిఫెన్స్ చోసుకోలేదు.. కళ్యాణ్‌ను రఫ్పాడించిన శ్రీజ!

KTR: తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది: కేటీఆర్

Shreyas Iyer Injury: ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.. అసలు ఏం జరిగిందంటే ?

Suryapet News: ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి: ఎస్పీ నరసింహ

Haryana: సిస్టర్స్ డీప్ ఫేక్ వీడియోలు.. సోదరుడు ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు