Bigg Boss Telugu Promo (Image Source: Youtube)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

Bigg Boss Telugu Nominations: బిగ్ బాస్ లో ఏదైనా హైఓల్టేజ్ మూమెంట్ ఉందంటే అది సోమవారం వచ్చే ఎపిసోడే. ఎందుకంటే ప్రతీ సోమవారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ జరుగుతుంటాయి. తాము బయటకు పంపాలని భావిస్తున్న హౌస్ మేట్ ను తోటి సభ్యులు.. సోమవారం ఎపిసోడ్ లో నామినేట్ చేస్తుంటారు. ఈ క్రమంలో సభ్యుల మధ్య చోటుచేసుకునే వాద, ప్రతివాదనలు.. ప్రేక్షలకు మంచి ఎంటర్ టైన్ మెంట్ ను ఇస్తుంటాయి. అయితే ఎప్పటిలాగే ఈ సోమవారం కూడా బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ జరిగింది. కానీ ఇక్కడే డిఫరెంట్ గా ఆలోచించిన బిగ్ బాస్ టీమ్.. గత 6 వారాల్లో ఎలిమినేట్ అయిన సభ్యుల చేత ఈ నామినేషన్ ప్రక్రియను జరిపించారు.

ప్రోమోలో ఏముందంటే?

సోమవారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ టీమ్ తాజాగా విడుదల చేసింది. గత వారాల్లో ఎలిమినేట్ అయిన శ్రీజ, ప్రియా, ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్.. తిరిగి ఇంట్లోకి అడుగుపెట్టడం ప్రోమోలో చూడవచ్చు. ప్రోమోను బట్టి చూస్తే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చేతికి రెండు కత్తులను బిగ్ బాస్ ఇచ్చారు. అందులో ఒకటి తాము ఎలిమినేట్ చేయదలిచిన వ్యక్తులకు (ఇంటి సభ్యుల తగిలించుకున్న బ్యాగ్ కు) గుచ్చాల్సి ఉంటుంది. రెండో కత్తిని తాము కోరుకున్న ఇంటి సభ్యుడికి అందించాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కంటెస్టెంట్.. ఇంట్లోని మరో వ్యక్తి చేసిన తప్పులను ఎత్తి చూపుతూ నామినేట్ చేయడాన్ని ప్రోమోలో చూడవచ్చు.

మాటల రగడ

అయితే సోమవారం ఎపిసోడ్ ప్రోమోలో మాజీ ఇంటి సభ్యులు.. కొందరు ప్రస్తుత హౌస్ మేట్స్ మధ్య మాటల రగడ జరిగింది. బాడీ షేమింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. సంజనాను ప్రియా నామినేట్ చేయడం ప్రోమోలో కనిపించింది. రోడ్ రోలర్ అంటూ దివ్యను బాడీ షేమింగ్ చేసి.. దానిని చాలా లైట్ తీసుకున్నారని ప్రియా మండిపడ్డారు. మరోవైపు మర్యాద మనీష్.. ఇంటి సభ్యుడైన కళ్యాణ్ ను నామినేట్ చేశారు. తనూజాతో సన్నిహితంగా ఉండటం, గతవారం నామినేషన్ లో యూటర్న్ తీసుకోవడం వంటి అంశాలను మర్యాద మనీష్ ప్రస్తావించారు.

Also Read: Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

ఇమ్మాన్యుయేల్ వర్సెస్ తనూజ

మాజీ హోస్ మేట్స్ లోని ఇద్దరు తమ రెండో కత్తిని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ తో పంచుకున్నట్లు ప్రోమోను బట్టి తెలుస్తోంది. ప్రోమో ప్రకారం కళ్యాణ్.. రామును నామినేట్ చేశాడు. ఇమ్మాన్యుయెల్ అనూహ్యంగా తనూజను ఇంటి నుంచి బయటకు పంపేందుకు నామినేట్ చేశాడు. ఈ క్రమంలో కళ్యాణ్ వర్సెస్ రాము, ఇమ్మాన్యుయెల్ వర్సెస్ తనూజ డ్రామా చోటుచేసుకుంది. కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ తమ నామినేషన్స్ పాయింట్స్ చెప్పగా.. రాము, తనూజ వాటిని డిఫెన్స్ చేసుకోవడం ప్రోమోలో చూడవచ్చు. మెుత్తంగా ఎలిమినేట్ అయిన సభ్యుల రీ-ఎంట్రీతో ఈ వారం నామినేషన్స్ నెక్ట్స్ లెవల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Just In

01

Mass Jathara: మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్.. రవితేజ కోసం కోలీవుడ్ స్టార్ హీరో..?

Karimnagar Crime: రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. పక్కింటి వారితో కిటికీ లొల్లి.. ప్రాణం తీసుకున్న మహిళ

CP Sajjanar: తాగి డ్రైవింగ్ చేస్తే వాళ్ళు టెర్రరిస్టులు: సీపీ సజ్జనార్

Cobra Snake Video: ఏకంగా పాముతో లిప్ కిస్.. వీడెంటి బాబోయ్ ఇలా చేస్తున్నాడు? వీడియో వైరల్

Harish Rao: వారికి పంపకాలపై దృష్టి ప్రజలపై పట్టింపు లేదు: హరీష్ రావు