Bigg Boss 9 Telugu (Image Source: Youtube)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss 9 Telugu: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. ఎందుకు డిఫెన్స్ చోసుకోలేదు.. కళ్యాణ్‌ను రఫ్పాడించిన శ్రీజ!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సోమవారం (అక్టోబర్ 27) ఎపిసోడ్ కు సంబంధించి రెండో ప్రోమో విడుదలైంది. ఈ వారం నామినేషన్స్ బాధ్యతను గత వారాల్లో ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులకు బిగ్ బాస్ అప్పగించారు. ఈ నేపథ్యంలో మెుదటి ప్రోమోలో ప్రియా, మర్యాద మనీష్ నామినేషన్స్ చూపించారు. తాజాగా విడుదలైన రెండో ఎపిసోడ్ లో ఫ్లోరా, దమ్ము శ్రీజ నామినేషన్స్ ను చూపించారు. కళ్యాణ్ ను నామినేట్ చేస్తూ దమ్ము శ్రీజ సంధించిన ప్రశ్నలు ప్రోమోకే హైలెట్ గా నిలుస్తున్నాయి.

ప్రోమోలో ఏముందంటే?

రెండో ప్రోమో ప్రారంభంలో మాజీ హౌస్ మేట్ ఫ్లోరా.. కొన్ని పాయింట్స్ చెబుతూ రీతూని నామినేట్ చేశారు. హౌస్ లో ‘ఫేక్ లవ్ స్టోరీ’ని క్రియేట్ చేశారని ఫ్లోరా ఆరోపణలు చేశారు. తొలుత కళ్యాణ్, ఇప్పుడు డిమోన్ పవన్ అంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా చూస్తుంటే చాలా ఫేక్ గా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. గతవారం అనారోగ్యంతో అయేషా ఇంటి నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో మీరు (రీతూ) నవ్వుతూ కనిపించారని ఫ్లోరా అన్నారు. తనూజ కోసం కళ్యాణ్ కంటతడి పెడితే.. మీరు మాత్రం చాలా ఆనందించారని పేర్కొన్నారు. అయితే దీనిపై రీతూ స్పందిస్తూ.. ఒక మనిషి బాధపడుతుంటే నవ్వే గుణం తనకు లేదని బదులిచ్చారు.

సుమంత్ శెట్టి ఫైర్..

తనకు ఇచ్చిన రెండో నామినేషన్ పవర్ ను ఫ్లోరా.. సుమన్ శెట్టికి ఇచ్చారు. దీంతో సుమన్.. సంజనాను నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించడం ప్రోమోలో చూడవచ్చు. గత వారం జరిగిన దానికి సారీ చెప్పా కదా అన్న అంటూ సుమన్ శెట్టితో సంజనా అన్నారు. అప్పుడు సుమన్ ఘాటుగా బదులిస్తూ ‘లాగి పెట్టి చెంపపైన కొట్టి.. తర్వాత సారీ సిస్టర్ అని చెబితే ఊరుకుంటారా?’ అని సుమన్ శెట్టి ప్రశ్నించడం ప్రోమోలో కనిపించింది. ‘ఎవరు తొక్కలో కెప్టెన్ ఇక్కడ’ అంటూ గతవారం ఆమె అన్న మాటలకు సైతం ఫైర్ అయ్యారు. మీరు కెప్టెన్ అయినప్పుడు తాము ఎంతగానో గౌరవం ఇచ్చామని సంజనాకు గుర్తుచేశారు.

Also Read: Haryana: సిస్టర్స్ డీప్ ఫేక్ వీడియోలు.. సోదరుడు ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

కళ్యాణ్ వర్సెస్ శ్రీజ

ప్రోమోలో చివరిలో కళ్యాణ్ ను నామినేట్ చేసిన శ్రీజ.. ఘాటు ప్రశ్నలు వేయడం చూడవచ్చు. ‘నువ్వు అమ్మాయిల పిచ్చోడివా?’ అంటూ శ్రీజ ప్రశ్నించగా.. కాదని కళ్యాణ్ సమాధానం ఇస్తాడు. మరి ఆ రోజు ఎందుకు డిఫెన్స్ చేసుకోలేకపోయావని శ్రీజ నిలదీస్తుంది. తేలిగ్గా ఎందుకు తీసుకున్నావ్ అంటూ మండిపడింది. క్యారెక్టర్ అసాసియేషన్ చేసిన కూడా సారీ చెప్పారు కదా అని ఊరుకున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు లాస్ట్ వీక్ తనూజాను ఎందుకు నామినేట్ చేయలేదని కళ్యాణ్ ను ప్రశ్నించింది. అప్పుడు కళ్యాణ్ బదులిస్తూ తన నామినేషన్ రీజన్స్ కు జస్టిఫికేషన్ వచ్చేసిందని.. కాపీ క్యాట్ నామినేషన్ కాకూడదనే వేయలేదని అన్నాడు. అప్పుడు శ్రీజ సమాధానం ఇస్తూ.. తనూజాను నామినేట్ చేస్తే నెగిటివ్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు నామినేట్ చేయలేదని ఘాటుగా ఆన్సర్ ఇవ్వడం ప్రోమోలో కనిపించింది.

Also Read: Bigg Boss 9 Telugu: అంత ఓవరాక్షన్ అవసరమా.. రమ్య మోక్ష ఎలిమినేషన్ పై నెటిజెన్స్ రియాక్షన్ ఇదే..!

Just In

01

Chiranjeeva Trailer: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేత సుడిగాలి పర్యటన.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Sreeleela: పెళ్లి తర్వాత అలాంటి పాత్రలే ఎక్కువ చేస్తా.. వైరల్ అవుతున్న శ్రీలీల బోల్డ్ కామెంట్స్

Telangana: ‘దూపదీప నైవేథ్యం’ స్కీమ్‌.. ఆలయాల నుంచి భారీగా దరఖాస్తులు.. అధికారుల మల్లగుల్లాలు!

Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ అప్డేట్.. వీడియో వైరల్