Medak Tragedy: అంత్యక్రియలకు వెళ్ళి మంజీరా నది లో స్నానానికి వెళ్ళి. ఇద్దరు మృతి చెందిన సంఘటన మెదక్ (Medak) జిల్లా మెదక్ మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
రూరల్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మెదక్ మండలం పేరూరు గ్రామానికి చెందిన చింతకింది అంజమ్మ( 60) సోమవారం రాత్రి మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు మంగళవారం గ్రామ శివారు ఉన్న గల మంజీరా నది ఒడ్డున జరిగాయి.
Also Read: Medak Tragedy: మెదక్‌లో కలచివేసిన సంఘటన.. ఆత్మహత్యకు యత్నించిన తల్లి, ఇద్దరు చిన్నారులు
మంజీరా నది లో స్నానానికి దిగి
ఆమె అంత్యక్రియల అనంతరం మంజీరా నది లో స్నానానికి దిగిన చింతకింది శ్రీకృష్ణ (16) బాలుడు కాలు జారి వాగులో మునగడంతో కాపాడేందుకు చింతకింది బీరయ్య (38) వాగులో దిగడం జరిగిందని ప్రమాద వదత్తు బాలుడిని కాపాడుటకు వాగులో దిగి అతను కూడా వాగులో మునిగిపోవడంతో ఇద్దరు మృతి చెందిన నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. రెస్క్యూ టీమ్ మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.మెదక్ రూరల్ సీఐ జార్జి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
Also Read: Medak District: మహిళను చీరతో చెట్టుకు కట్టేసి అత్యాచారం.. మెదక్ జిల్లాలో దారుణ ఘటన

