Medak District: మెదక్ జిల్లా (Medak District) కొల్చారం మండలం ఏడుపాయల మొదటి బ్రిడ్జి వద్ద గిరిజన వివాహిత మహిళ పై గుర్తు తెలియని దుండగులు హత్యాచారం చేశారు. అపస్మారక స్థితిలో కి చేరుకున్న మహిళ ను చీరతో చెట్టుకు కట్టేసి దుండగులు పరార్ అయ్యారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగుచూసింది. మెదక్ రూరల్ మండలం చిట్యాల గ్రామపంచాయతీ పరిధిలోని గుడి తండా నాకు చెందిన వివాహిత మహిళల గా పోలీసులు గుర్తించారు.
Also Read: Crime News: కాలేజీ నుంచి ‘కోటి’ లూటీ.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పనేనా…?
క్లోస్ టీం ను సంఘటన స్థలంలో వివరాలు సేకరణ
బాధిత మహిళ భర్త రవినాయక్ ను మెదక్ రూరల్ సీఐ జార్జి వివరాలు అడిగి తెలుసుకున్నారు.మెదక్ డీఎస్పీ,ప్రసన్నకుమార్,మెదక్ రూరల్ సీఐ జార్జి,కొల్చారం,పాపన్నపేట ఎస్ ఐ మహమ్మద్ మోయినుద్దీన్ శ్రీనివాస్ గౌడ్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. క్లోస్ టీం ను సంఘటన స్థలంలో వివరాలు సేకరించింది. అత్యాచారం గురైన మహిళను స్థానిక మెదక్ ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి శనివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో మెదక్ రూరల్ సీఐ జార్జి ఆధ్వర్యంలో అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కూలిపని కోసం
కూలిపనికోసం ఉదయం గుడితండా నుండి అత్యాచారానికి గురైన మహిళ బయలుదేరినట్లు బాధిత మహిళ భర్త రవినాయక్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
ఏడుపాయల ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు
ఏడుపాయల దుర్గామాత ఆలయ ఆలయానికి వెళ్లే దారిలో మొదటి బ్రిడ్జి దాటిన తర్వాత కాంగ్రెస్ నాయకుడు గాలి అనిల్ కుమార్ గెస్ట్ హౌస్ వెనకాల ఈ సంఘటన చోటుచేసుకుంది. తోటి కూలీలే ఈ అత్యాచారానికి ఒడిగట్టారా లేదా ఇంకెవరైనా తెలిసిన వారే గతకానికి పాల్పడ్డారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సిసిటీవీ లను పోలీసులు పరిశీలిస్తున్నారు ఈ మహిళా ఎప్పుడు ఈ ప్రాంతానికి బయలుదేరింది ఏ ఆటో లో ప్రయాణించింది అన్న కోణంలో విచారణ జరుగుతుంది.
Also Read: Nalgonda Crime: నల్గొండలో దారుణ ఘటన.. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఆపై హత్య!
