Medak Tragedy: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి జాతీయ రహదారిపై గల వాగులో ఇద్దరు పిల్లలతో సహా తల్లి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అది గమనించిన స్థానికులు తల్లిని కాపాడారు. ఇద్దరు పిల్లలు మాత్రం మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమతకు ఇద్దరు కూతుళ్లు.. పూజిత (7), తేజస్విని (5) ఉన్నారు. భర్త చనిపోవడంతో తల్లి ఇంటి వద్ద ఉంటున్న మమత నాగులపల్లి రహదారిపై గల వాగులోకి ఇద్దరు పిల్లలతో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.
Om Prakash murder case: మాజీ డీజీపీ దారుణ హత్య.. పక్కా స్కెచ్ తో లేపేసిన భార్య, కూతురు
ఈ ఆత్మహత్యా ప్రయత్నంలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా, మమతను స్థానికులు కాపాడారు. వాగులో దూకి చనిపోయిన చిన్నారులను ప్రత్యేక బృందాల ద్వారా తూప్రాన్ పోలీసులు బయటకు తీసుకొచ్చారు. తన ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో మమత విలపించింది. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. తూప్రాన్ ఎస్ఐ సదానందం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు