Om Prakash murder case (Image Source: AI)
క్రైమ్

Om Prakash murder case: మాజీ డీజీపీ దారుణ హత్య.. పక్కా స్కెచ్ తో లేపేసిన భార్య, కూతురు

Om Prakash murder case: గతంలో జరిగిన కర్ణాటక మాజీ డీజీపీ (Karnataka Ex DGP) దారుణ హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. బెంగళూరు (Bengaluru) నగరం నడిబొడ్డున సంపన్నులు నివాసం ఉండే ప్రాంతంలో మాజీ డీజీపీ.. నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన నివాసంలోనే హత్యకు గురికావడం అందరినీ కలవరానికి గురి చేసింది. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. తాజాగా సంచలన నిజాలు వెలుగు చూశాయి.

భార్యనే హంతకురాలు
కర్ణాటక మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాష్ (68) హత్య కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.. ఓంప్రకాష్‌ను ఆయన భార్య పల్లవి దారుణంగా చంపేసినట్లు పోలీసులు తాజాగా తేల్చారు. కళ్లల్లో కారం కొట్టి, కాళ్లుచేతులు కట్టేసి.. తర్వాత పొడిచి చంపేసిందని నిర్ధారించారు. ఓం ప్రకాష్‌ ఛాతి, పొట్టభాగాలపై పలు కత్తిపోట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. భర్తపై పల్లవి (Pallavi) గాజు సీసాతో కూడా దాడి చేసి.. దారుణంగా చంపిందని పోలీసులు చెప్పారు..

కూతురు సమక్షంలో..
అయితే భర్తను హత్య చేసిన విషయాన్ని పల్లవి మరో పోలీస్‌ అధికారి భార్యకు చెప్పిందని పోలీసులు వెల్లడించారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మరో కీలక నిజం తెలిసింది. ఓం ప్రకాష్ పై దాడి జరుగుతున్నవేళ కూతురు కృతి కూడా స్పాట్ లోనే ఉందని పోలీసులు తేల్చారు. తాజాగా ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.

కారణమదేనా!
మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్యకు ఆస్తి వివాదమే కారణమని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఓం ప్రకాష్‌ తన ఆస్తిని బంధువుకు రాసిచ్చారని.. దీంతో ఈ అంశంపైనే భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.

భార్య ఏమన్నదంటే!
ఆ తర్వాతే భర్తను చంపేసింది భార్య పల్లవి స్కెచ్ వేసి చంపినట్లు పేర్కొంటున్నారు. అయితే ఓంప్రకాష్‌ కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.. తల్లీకూతుళ్లను అదుపులోకి తీసుకుని 12 గంటలపాటు ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఓంప్రకాష్‌ హత్యపై తల్లీకూతుళ్ల వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. వారం రోజుల నుంచి తనను చంపేస్తానంటూ భర్త ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నారని భార్య పల్లవి పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది.

Also Read: Pope Francis dies: క్యాథలిక్స్ కు బిగ్ షాక్.. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

పోలీసుల అదుపులో తల్లీ కూతుళ్లు
ఇదే విషయమై హత్య జరిగిన రోజు ఉదయం నుంచి ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే తనను, తన బిడ్డను చంపడానికి ఓంప్రకాష్‌ ప్రయత్నించారని పల్లవి చెప్పింది. కేవలం తమ ప్రాణాలు కాపాడుకోవడానికే ఈ హత్యచేశామని కూతురు కృతి తెలిపింది. తన తండ్రి కాళ్లుచేతులు కట్టేసి.. కారంచల్లి, వంటనూనె పోశామని ఒప్పుకుంది. ఓం ప్రకాష్ భార్య పల్లవి, కుమార్తె కృతి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఓ ప్రకాష్ మృతదేహానికి ఈరోజు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

Also Read This: KPHB Crime: భర్తపై విరక్తి.. షాకిచ్చి చంపిన భార్య.. హైదరాబాద్ లో దారుణం

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది