Jogipet Area Hospital: జోగిపేటలోని ఏరియా ఆసుపత్రికి వారం రోజుల్లో ఆరు మంది కొత్త డాక్టర్ల నియామకం జరుగుతుందని డీసీహెచ్‌ఎస్(DCHS) ఎండీ షరీఫ్ తెలిపారు. సోమవారం జోగిపేటలోని ఆసుపత్రిని డీసీహెచ్‌ఎస్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ అటెండెన్స్ విషయంలో కూడా స్ట్రిక్ట్‌గా ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతం జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రమేశ్(Dr. Ramesh)ను జహీరాబాద్ నుంచి డిప్యూటేషన్‌పై వేసినట్లు తెలిపారు.
కాంట్రాక్టర్ అసంపూర్తిగా..
ఆసుపత్రిలో మురికి నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా అవుట్‌పుట్‌ను ఏర్పాటు చేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడంపై డీసీహెచ్‌ఎస్ అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఆసుపత్రిలోని డ్రైనేజీ లీకేజీలను స్వయంగా పరిశీలించారు. నాలుగు చోట్ల లీకేజీలు ఉన్నాయని, దీనివల్ల దుర్వాసన వస్తుందని, ఆసుపత్రిలో డ్రైనేజీ, సీసీ రోడ్లు పూర్తి చేయాల్సిన కాంట్రాక్టర్ అసంపూర్తిగానే వదిలేసి వెళ్లినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ డీసీహెచ్‌ఎస్‌కు సూచించారు. కాంట్రాక్టర్ పై జిల్లా కలెక్టర్‌కు లేఖ వ్రాయాలని ఆయన సూపరిండెంట్‌కు సూచించారు. ప్రతి డాక్టర్ ఉదయం పూట ఆరు గంటపాటు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read: Republic Day – 2026: ‘ఆపరేషన్ సింధూర్ శకటం’.. దిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో ఆసక్తికర దృశ్యాలు!
కమిషనర్‌కు డాక్టర్ల జవాబులు
ఇటీవల విధుల నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన 12 మంది డాక్టర్‌లకు రాష్ట్ర వైధ్య విధాన పరిషత్ కమిషనర్ షోకాజ్ నోటీసులను జారీ చేయగా అందరూ కమిషనర్‌కు సమాధానాలు ఇచ్చారని డీసీహెచ్‌ఎస్ తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమైందని, కొందరు, ట్రాఫిక్‌లో ఆలస్యమైందని, వచ్చినా వేరే విధుల్లో ఉండిపోయానని జవాబులు ఇచ్చిటన్లు తెలిపారు. దీంతో డాక్టర్లు ఇచ్చిన జవాబులపై కమిషనర్ ఏలాంటి చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూడాల్సి ఉంది.
Also Read: Republic Day 2026:: మేడ్చల్ పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు!

