Dubbaka News: దుబ్బాకలో తలకిందులుగా ఎగిరిన త్రివర్ణ పతాకం
Dubbaka News (imagecredit:swetcha)
మెదక్

Dubbaka News: దుబ్బాకలో తలకిందులుగా ఎగిరిన త్రివర్ణ పతాకం.. ఆగ్రహించిన నాయకులు..?

Dubbaka News: గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాకు అవమానం చోటుచేసుకోవడం దుబ్బాక పట్టణంలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక(Dhubaka) పట్టణంలోని గాంధీ చౌరస్తాలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA KOtha Prabhkar Reddy) త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగరవేయడంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు. జాతీయ జెండా తలకిందులుగా ఎగిరిన విషయాన్ని గమనించిన కొందరు నాయకులు వెంటనే ఎమ్మెల్యేకు సూచించడంతో జెండాను కిందికి దించి తిరిగి సరిగా ఎగరవేశారు. అయినప్పటికీ జాతీయ జెండాకు అవమానం జరిగిన తీరుపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇది రాజకీయ వేదిక కాదని పేర్కొంటూనే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం

గణతంత్ర వేడుకల వంటి జాతీయ కార్యక్రమంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఎమ్మెల్యే ప్రసంగాన్ని కొనసాగించడంతో కాంగ్రెస్ నాయకులు స్టేజి వైపు దూసుకువెళ్లారు. దీనికి ప్రతిగా అక్కడే ఉన్న బీఆర్ఎస్(BRS) నాయకులు కాంగ్రెస్(Congress) నాయకులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు జాతీయ జెండాకు అవమానం జరగడం మరోవైపు రెండు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను విమర్శించాలనుకుంటే రాజకీయ వేదికలను ఎంచుకోవాలే తప్ప జాతీయ పండుగల వేడుకలను రాజకీయ రంగు పూయడానికి వాడకూడదని స్థానికులు మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవం వంటి పవిత్రమైన రోజున ఈ తరహా ఘటనలు జరగడం దురదృష్టకరమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Medical Colleges: వైద్య విద్యలో కీలక మార్పులు..సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలుగా ఆ మూడు మెడికల్ కాలేజీలు!

కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు

జాతీయ జెండాను తలకిందులుగా ఎగరవేసి అవమానించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు దుబ్బాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం పట్ల, జాతీయ చిహ్నాల పట్ల గౌరవం ఉండాలని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఘటనపై చట్టపరంగా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Also Read: Kishan Reddy: ఖర్చులు తగ్గించుకుని బొగ్గు ఉత్పత్తి పెంచండి.. లేకుంటే సింగరేణికి కష్టమే..!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?