Kishan Reddy: ఖర్చులు తగ్గించుకుని బొగ్గు ఉత్పత్తి పెంచండి
Kishan Reddy (imagecredit:X)
Telangana News

Kishan Reddy: ఖర్చులు తగ్గించుకుని బొగ్గు ఉత్పత్తి పెంచండి.. లేకుంటే సింగరేణికి కష్టమే..!

Kishan Reddy: సింగరేణి కార్మికుల వద్ద దాచిపెట్టాల్సిందేమీ లేదని, వారికి అన్నీ తెలుసని, అందుకే.. ఖర్చులను తగ్గించుకుని ముందుకెళ్లాలని, ఖర్చు తగ్గించుకోవడంతోపాటు.. బొగ్గు ఉత్పత్తిని పెంచాలని, అందులోనూ నాణ్యమైనటువంటి బొగ్గు ఉత్పత్తి జరగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishana Reddy) సూచించారు. కొత్తగూడెం పరిధిలోని 74 ఏళ్ల నాటి పీవీకే-5 అండర్‌గ్రౌండ్ మైన్ ఆవరణలో బొగ్గుగని కార్మికులతో కిషన్ రెడ్డి ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను, ముఖ్యమంత్రి, సీఎండీ మొదలుకుని.. సామాన్య కార్మికుడి వరకు అంతా సింగరేణి కుటుంబ సభ్యులమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని వివరించారు. మార్కెట్ లో పోటీతత్వం పెరిగిందని, ఇతర దేశాలనుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నుంచి బయటకు రావాలని కోరారు. భారత్ నుంచి బొగ్గు ఎగుమతి జరగాలనేది ప్రధాని మోడీ ఆలోచన అని, ఇక్కడ బొగ్గు నాణ్యత పెరిగితేనే.. ఇతరదేశాల నుంచి దిగుమతి తగ్గుతుందని, అందుకు అనుగుణంగా అందరూ అంకితభావంతో పనిచేయాలన్నారు.

గతంలో బొగ్గు వెలికితీత చాలా ప్రమాదకరం

తెలంగాణ ఆడబిడ్డలు అండర్ గ్రౌండ్‌లో పనిచేస్తున్నారని కొనియాడారు. 136 చరిత్ర గల సింగరేణి.. తెలంగాణకు దేశానికి ఒక ప్రత్యేకమైన సంస్థగా వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గనిలోకి వచ్చానని, ఇప్పుడు ఈ శాఖకు కేంద్రమంత్రిగా వస్తానని ఏనాడూ ఊహించలేదని, ఇది తనకు గర్వకారణంగా చెప్పుకొచ్చారు. సింగరేణి ద్వారా 25 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయన్నారు. గతంలో బొగ్గు వెలికితీత చాలా ప్రమాదకరంగా ఉండేదని, అప్పుడు కూడా ప్రాణాలను లెక్కచేయకుండా కార్మికులు పనిచేశారని కొనియాడారు. ఇవాళ సాంకేతికత పెరిగిందని, దీంతో భద్రతా ప్రమాణాలు కూడా పెరిగాయన్నారు. తమకు ప్రతి కార్మికుడి ప్రాణం విలువైనదని, అందుకే జీరో యాక్సిడెంట్ మైన్ పాలసీతో ముందుకెళ్లాలని.. కోల్ కంపెనీలకు కిషన్ రెడ్డి సూచించారు. దురదృష్టవశాత్తూ కార్మికులకు ఏమైనా జరిగితే.. వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే బాధ్యత కంపెనీదే అని అందుకే దేశవ్యాప్తంగా 4 లక్షల మంది బొగ్గు గని కార్మికులకు రూ.కోటి ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చామని కేంద్ర మంత్రి చెప్పారు.

Also Read: Gajwel Municipality: సమస్య పరిష్కరించకుంటే.. మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామన్న కాలనీవాసులు..?

కార్మిక సంఘాల ఎన్నికలు

సింగరేణి పరిస్థితి ఊహించినత గొప్పగా లేదని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే ఈ సంస్థను రాజకీయాలకు అతీతంగా కాపాడుకోవాలని సూచించారు. సంస్థ బాగుంటేనే అందరూ బాగుంటారన్నారు. తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రిగా తాను సింగరేణికి అన్నిరకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కార్మికులు ఐకమత్యంతో పనిచేసి సంస్థను కాపాడుకోవాలని సూచించారు. మిగిలిన బొగ్గు ఉత్పత్తి సంస్థలతో పోలిస్తే.. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ధర ఎక్కువగా ఉంది. ఇదే విషయాన్ని అధికారులకు కూడా చెప్పానని పేర్కొన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ను కేంద్రప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. ఏ కార్మిక సంఘమైనా.. సంస్థ విషయంలో ఐకమత్యంతో పనిచేయాలని, కార్మిక సంఘాల ఎన్నికలు జరిగితే పోటీ ఉండాలన్నారు. కానీ సంస్థ భవిష్యత్తు కోసం మాత్రం కలిసి పనిచేయాలని సూచించారు. ఇకపోతే.. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ అవుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని కిషన్ రెడ్డి నొక్కి చెప్పారు. ఇది కార్మికుల సంస్థ అని, లాభాల్లో మొదటి వాటా కార్మికులకే అందాలనేది ప్రధాని మోడీ ఆలోచన అని చెప్పుకొచ్చారు. కాగా తొలుత బొగ్గు గనిలో దిగి మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్ట్ సిస్టమ్ ద్వారా ప్రయాణించారు.

Also Read: Ramachandra Naik: భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది : ఎమ్మెల్యే రామచంద్రనాయక్!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?