Ramachandra Naik: భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే, డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ (Ramachandra Naik) పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మరిపెడ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వారి మేధోకృషితోనే
ఈ సందర్భంగా డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల అపార త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని, వారి మేధోకృషితోనే ప్రపంచంలోనే అత్యుత్తమమైన భారత రాజ్యాంగం రూపుదిద్దుకుందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి మౌలిక సూత్రాలతో భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిరంతరం వర్ధిల్లుతుండటం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ, దేశ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Student Indiscipline: పాఠశాలకు డుమ్మా ఆపై.. అల్లరి చేష్టలకు పాల్పడుతున్న విద్యార్థులు

