Ramachandra Naik: తండాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
Ramachandra Naik ( image CREDIT: SWETCHA REPORTER)
Political News, నార్త్ తెలంగాణ

Ramachandra Naik: తండాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపించాలి : జాటోత్ రామచంద్రనాయక్

Ramachandra Naik: తండాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్, జాటోత్ రామచంద్రనాయక్(Ramachandra Naik) పేర్కొన్నారు.  నరసింహులపేట మండలం బాస్ తండాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రనాయక్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి సాగుతుందన్నారు.

Also ReadStudent Indiscipline: పాఠశాలకు డుమ్మా ఆపై.. అల్లరి చేష్టలకు పాల్పడుతున్న విద్యార్థులు

ప్రభుత్వం పల్లెలపై ప్రత్యేక దృష్టి

గత పది ఏళ్లు పాలించిన ప్రభుత్వం పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తండాల అభివృద్ధి, పురోగతి, స్థానిక సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అన్నారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి సాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉందని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గిరిజనుల సంక్షేమం, యువతకు అవకాశాలు, రైతుల సంక్షోభం వంటి అంశాలను ప్రభుత్వం పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే బాస్ తండాను మరింత అభివృద్ధి చేసుకునేందుకు దోహదపడుతుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Also Read: CM Revanth Reddy: సబ‌ర్మ‌తీ తీరంలా మూసీని మారుస్తాం.. సీఎం కీలక వ్యాఖ్యలు!

Just In

01

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?