CM Revanth Reddy (imagecredit:twitter)
తెలంగాణ

CM Revanth Reddy: సబ‌ర్మ‌తీ తీరంలా మూసీని మారుస్తాం.. సీఎం కీలక వ్యాఖ్యలు!

CM Revanth Reddy: అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ నిర్ణ‌యాల‌తోనే ఆ దేశానికి ఎక్కువ నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ట్రంప్ తరహాలోనే తెలంగాణలో కేసీఆర్(KCR) గడిచిన పదేళ్లుగా వ్యవహరించారని, ప్రస్తుతం జనాలు ఆయన్ను పక్కకు పెట్టారన్నారు. పబ్లిక్ ఎఫైర్స్ ఆఫ్​ ఇండియా 12 వ వార్షిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాత్రి వచ్చిన ఆలోచనను తెల్లారే అమలు చేయడం ప్రభుత్వంలో సాధ్యం కాదని, కానీ ట్రంప్(Trump), కేసీఆర్ లు అదే బాట పట్టారన్నారు. అందుకే పబ్లిక్ తిరస్కరించారన్నారు. ప‌రిపాల‌న చేసేందుకు రాజ‌కీయ సంక‌ల్పం ఎంతో అవ‌స‌రమన్నారు. భవిష్యత్ తరాలకు అవకాశాలను సృష్టించాల‌నేది తమ ఆలోచన అన్నారు. దేశంలో యంగెస్ట్ స్టేట్ (కొత్త రాష్ట్రం) తెలంగాణ అని , కొత్త రాష్ట్రమైనా…హైద‌రాబాద్‌కు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్నదని వివరించారు. తెలంగాణ స‌ర్వ‌తోముఖాభివృద్ధికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపొందించామన్నారు. దీన్ని డిసెంబరు 9న రిలీజ్ చేస్తామన్నారు. తెలంగాణ‌ను కోర్ అర్బ‌న్‌,సెమీ అర్బ‌న్‌, రూర‌ల్‌గా విభ‌జించామని, కోర్ అర్బ‌న్ ఏరియాలో కోటి మంది నివసిస్తున్నట్లు తెలిపారు. ఇక్క‌డ కాలుష్య‌కార‌క ప‌రిశ్ర‌మ‌ల‌ను న‌గ‌రం వెలుప‌లికి త‌ర‌లిస్తున్నామన్నారు.

2027 నాటికి హైద‌రాబాద్‌లో

ఇక సెమీ అర్బన్ ఏరియాను త‌యారీ రంగం జోన్ గా (మాన్యుఫాక్చర్) నిర్ణయించామన్నారు. తెలంగాణ‌లో అభివృద్ధికి త‌గిన‌ట్లు 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 150 కిలోమీట‌ర్లు పొడిగించాల‌ని నిర్ణ‌యించామన్నారు.సబ‌ర్మ‌తీ తీరంలా మూసీని మారుస్తామన్నారు.అందుకు మూసీ పున‌రుజ్జీవంపై దృష్టి సారించామన్నారు.హైద‌రాబాద్‌(Hyderabad)లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేప‌డుతున్నామన్నారు. 2027 నాటికి హైద‌రాబాద్‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలే ఎక్కువ‌గా ఉండే అవకాశం ఉన్నదని, అందుకే ఈవీల‌కు రాయితీలు ప్రకటించామన్నారు. రాష్ట్ర అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నిర్మాణానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామన్నారు. విమానాశ్ర‌యం నుంచి భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ అనుసంధాన‌త క‌ల్పిస్తామన్నారు. తెలంగాణ‌లో సేంద్రియ పంట‌లు పండుతున్నాయని, తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానంప‌లుకుతున్నామన్నారు.

Also Read: Sekhar Kammula: ఇలాంటి సినిమాలు నిర్మించ‌డానికి ధైర్యం ఉండాలి.. యంగ్ హీరో సినిమాపై ప్రశంసలు

తెలంగాణకు భూపరివేష్టిత రాష్ట్రం

పెట్టుబ‌డిదారుల‌కు మ‌ద్దతుగా నిలుస్తామన్నారు. తెలంగాణ‌(Telangana)లో పెట్టే పెట్టుబ‌డుల‌కు భ‌ద్ర‌త ఉంటుందన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా డ్ర‌గ్స్ స‌మ‌స్య ఉన్నదని, తెలంగాణ‌లో డ్ర‌గ్స్‌ను కంట్రోల్ చేశామన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదన్నారు.ఫ్యూచర్ సిటీని 30వేల ఎకరాకుపైగా నిర్మిస్తున్నామని, తొలి దశలో ఏఐ సిటీ(AI City),ఎడ్యుకేషన్‌ జోన్, హెల్త్‌ జోన్‌ వంటి తొమ్మది జోన్లు ఉంటాయన్నారు. ‘ఎయిర్ పోర్ట్ నుంచి భారత్‌ ఫ్యూచర్‌ సిటీ అనుసంధానత కల్పిస్తాం. తెలంగాణకు భూపరివేష్టిత రాష్ట్రం (ల్యాండ్‌ లక్డ్‌) కావడంతో ఓడ రేవు లేదన్నారు. అందుకే మచిలీపట్నం ఓడ రేవు అనుసంధానానికి ఫ్యూచర్‌ సిటీ నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, దానికి సమాంతరంగా రైల్వే లైన్‌ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తాయ్నారు.స్పోర్ట్స్‌లో దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలకు వచ్చే మెడల్స్‌ చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని, అందుకే ఒలింపిక్స్‌ పతకాల సాధనే లక్ష్యంగా యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు.

న్యూజెర్సీ గవర్నర్ తో భేటీ..

సీఎం రేవంత్‌ రెడ్డితో న్యూజెర్సీ గవర్నర్‌ పిలిప్‌ డి.మర్ఫీతో భేటీ అయ్యారు. విద్యా, గ్రీన్‌ ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ (సినిమా రంగం), మౌలిక వసతులు (మెట్రో… పట్టణ రవాణా), మూసీ రివర్‌ ఫ్రంట్‌ తదితర అంశాలపై ఆయన తో చర్చించారు. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగిన ఈ భేటిలో గవర్నర్‌ సతీమణితో పాటు న్యూజెర్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విజన్‌ 2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తోన్న కృషిని సీఎం వివరించారు. న్యూజెర్సీ రైల్‌ అథారిటీ ద్వారా హైదరాబాద్‌ పట్టణ, ప్రజా రవాణా రంగాలకు, తెలంగాణ రైజింగ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎం రేవంత్‌కు మర్ఫీ హామీ ఇచ్చారు.

Also Read: Tirupati: తిరుపతిలో రెచ్చిపోయిన పోకిరీలు.. నడిరోడ్డుపై కోటింగ్ ఇచ్చిన పోలీసులు

Just In

01

Harish Rao: లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టే ధైర్యం ప్రభుత్వానికి లేదా: హరీష్ రావు

Ramachandra Rao: ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం.. అలైన్ మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్!

H-City Project: ముందుకు సాగని హెచ్ సిటీ పనులు.. ఎందుకో తెలుసా..!

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?