Telangana Police Jobs: ప్రస్తుతం ఒక్క జాబ్ తెచ్చుకోవాలంటే.. చాలా కష్ట పడాల్సి వస్తుంది. ఎందుకంటే, ఇది వరకు లాగా పరిస్థితులు లేవు. ఇప్పుడు ప్రతీ చిన్న జాబ్ కి కూడా ప్రిపేర్ అయ్యి పరీక్ష రాయాల్సి వస్తుంది. పరీక్షా రాసిన కూడా జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. అలాంటి వాళ్ళు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు పడుతుందా అని వెయిట్ చేస్తుంటారు. తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్తగా, 12,452 పోలీస్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మాజీ సీఎస్ శాంతి కుమారి నేతృత్వంలోని కమిటీ వివిధ శాఖల నుండి ఖాళీల వివరాలను సేకరించి, ఈ భారీ రిక్రూట్‌మెంట్‌కు సన్నాహాలు చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ వంటి వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. అర్హతలు సాధారణంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఆధారంగా ఉంటాయి.
వివరాలు
పోస్టుల సంఖ్య: 12,452
శాఖ: తెలంగాణ పోలీస్ శాఖ
అర్హతలు: 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ (పోస్టును బట్టి మారవచ్చు)
Also Read: Shabana Azmi: పుట్టింది స్టార్ కుటుంబంలో.. అయినా టీ అమ్మింది.. కట్ చేస్తే అయిదు జాతీయ అవార్డులు
వయోపరిమితి: సాధారణంగా 18-25 ఏళ్లు (కానిస్టేబుల్‌కు), 20-28 ఏళ్లు (సబ్-ఇన్‌స్పెక్టర్‌కు); SC/ST/OBC వారికి వయోసడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ (PMT/PET), మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ (పోస్టును బట్టి) ఉంటుంది.
Also Read: MP Etela Rajender: ఆత్మగౌరవం కోల్పోయాక పదవి గడ్డిపోచతో సమానం.. ఈటల సంచలన వ్యాఖ్యలు