Ramachandra Naik ( image credit: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Ramachandra Naik: ఇందిరమ్మ ఇండ్లు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Ramachandra Naik: నిరుపేదల ఇండ్లలో చీకట్లను ప్రారదోలి వారి కళ్ళలో విద్యుత్ కాంతులను కాంగ్రెస్ ప్రభుత్వం వెలిగించిందని డోర్నకల్ ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్ర నాయక్ పేర్కొన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.

 Also Read: Vijaya Dairy: విజ‌య పాల డైరీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం.. కీలక అంశాలపై చర్చ!

అనంతరం రామచంద్రనాయక్ మాట్లాడుతూ…

నిరుపేదల చిరకాల కాంక్ష ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్ గ్యారంటీల్లో ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ. 189.07 కోట్లను ఖర్చు చేసిందన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల ఉచిత వైద్యం పొందే సదుపాయం కల్పించిందన్నారు. ఇప్పటివరకు 1738 మందికి రూ.76.73 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. రూ. 500 కే వంట గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేసి ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలని లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 40 లక్షల లబ్ధిదారులు, జిల్లాలో ఒకటి పాయింట్ 16 లక్షల లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు.

రైతులకు రెండు లక్షల వరకు ఉన్న 65 వేల 147 మంది రైతులకు రుణమాఫీ కోసం రూ.570 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రైతు భరోసా పథకంలో సంవత్సరానికి ప్రతి ఎకరాకు 12 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. 2.12 లక్షల మందికి రూ. 268 కోట్లను వారి ఖాతాల్లో వేశామన్నారు. జిల్లాలో 550 రేషన్ షాపుల ద్వారా రెండు పాయింటు 70 లక్షల కార్డులకు 517 టన్నుల బియ్యం సరఫరా జరుగుతుందన్నారు. జిల్లాలో 31,052 కొత్త కార్డులు అందించామన్నారు. జిల్లాలో 2.43 లక్షల కార్డుదారులకు 14.41 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం జూన్ నెలలో ఒకేసారి పంపిణీ చేశామన్నారు. రైతులు సన్నధాన్యం పండిస్తే వారికి బోనస్ కింద క్వింటాల్లుకు రూ.500 చెల్లించామన్నారు.

180 క్లిస్టర్లకు 179 గ్రామ పాలన అధికారులు నియమించాం

గ్రామస్థాయిలో ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడం కోసం ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించిందన్నారు. 180 క్లస్టర్లకు 179 గ్రామ పరిపాలన అధికారులను నియమించామని వెల్లడించారు. మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న జిల్లా సమగ్ర అభివృద్ధికి నిత్యం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. యూరియా కష్టాలను జిల్లా కలెక్టర్, ఎస్పీలు తొలగించారని ప్రశంస రాష్ట్రవ్యాప్తంగా యూరియాకు కొద్ది గొప్పో ఇబ్బందులు తలెత్తితే మహబూబాబాద్ జిల్లాలో మాత్రం యూరియా కొరత రైతులను వేధించింది.

వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణితో రైతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించాల్సిన యూరియా విషయంలో వివక్ష చూపించడంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన యూరియా సరఫరా ప్రక్రియను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ లు సజావుగా సాగేందుకు పట్టిష్ట ప్రణాళికతో ముందుకు సాగారని ప్రశంసించారు. యూరియా కొరతను తమదైన శైలిలో ఇబ్బందులు లేకుండా రైతులకు పంపిణీ ప్రక్రియను కొనసాగిస్తున్న జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ లను శాలువాతో సన్మానించి అభినందించారు.

 Also Read: Maa Vande: ప్రధాని మోదీ బయోపిక్ “మా వందే”.. మోదీ పాత్రలో నటించేది ఎవరో తెలుసా ?

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?