modi ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Maa Vande: ప్రధాని మోదీ బయోపిక్ “మా వందే”.. మోదీ పాత్రలో నటించేది ఎవరో తెలుసా ?

Maa Vande: భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కనుంది. ఈ రోజు సెప్టెంబర్ 17, మోదీ 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించారు. “మా వందే” (Maa Vande) అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ భారీ చిత్రంలో మోదీ పాత్రలో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించనున్నారు.

Also Read: Telangana Tourism: హైదరాబాద్​‌లో 12 వారసత్వ కట్టడాల అభివృద్ధికి ప్రణాళికలు.. అవి ఏమిటంటే..?

తెలుగులో ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’ వంటి సినిమాల్లో నటించిన ఈ నటుడు, ఇప్పుడు మోదీ పాత్రతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.  సోలో హీరోగా మార్క్ మూవీతో పెద్ద హిట్ అందుకున్నాడు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ పతాకం పై వీర్ రెడ్డి ఎం నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రాంతి కుమార్ సిహెచ్ డైరెక్షన్ చేస్తున్నారు.

Also Read: Aarogyasri Services: ఆరోగ్య శ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలి.. సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి

టీ విక్రేతగా జీవితాన్ని ప్రారంభించి దేశ ప్రధానిగా ఎదిగిన మోదీ ప్రయాణాన్ని ఈ మూవీ ఆవిష్కరించనుంది. అలాగే, మోదీకి తన తల్లి హీరాబెన్ మోదీతో ఉన్న భావోద్వేగ బంధాన్ని కూడా హృదయస్పర్శిగా చిత్రీకరించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘బాహుబలి’ ఫేమ్ కెమెరామెన్ కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలకు సంగీతాన్ని అందించిన రవి బాసృర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణం, సాంకేతిక బృందంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మోదీ జీవితం అంతర్జాతీయ స్థాయిలో స్ఫూర్తిదాయకంగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Also Read: Thummala Nageswara Rao: తెలంగాణ విత్తన రంగానికి జాతీయ గుర్తింపు ఇవ్వాలి.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?