Medak News: బాలికల హక్కులను పరిరక్షించాలి
జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ సూచన
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: ఆడపిల్ల ఉన్న ప్రతి ఇల్లు ఎప్పుడు సంతోషకరంగా ఉంటుందని మెదక్ జిల్లా (Medak News) అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా శనివారం నాడు మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల బాలికలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడారు. బాలికల పట్ల వివక్షతను ప్రదర్శించకుండా వారి అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై క్రమం తప్పకుండా వివిధ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ.. ఉజ్వల అనే కార్యక్రమాన్ని చేపట్టామన్నామని మహేందర్ అన్నారు. ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడమే ఉజ్వల ప్రధాన లక్ష్యమని వివరించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉజ్వల కమిటీలను ఏర్పాటు చేసి బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టంపై అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు.
Read Also- Bandi Sanjay Kumar: ఉద్యోగ మేళాలో కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
అలాగే ‘బేటీ బచావో – డిజిటల్ హటావో’ అనే సందేశంతో బాలికలను డిజిటల్ దుర్వినియోగం నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రతి బాలికకు విద్య అందించినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమని ఆయన పేర్కొన్నారు. సమాజంలో మహిళలకు, ఆడపిల్లలకి గొప్ప హోదా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో అమ్మాయిలకు చదువు మీద ఎక్కువ ఆసక్తి ఉందని, ఇలాగే తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. ఒక్క చదువులోనే కాకుండా, క్రీడల్లో, ఎన్‌సీసీ, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆడపిల్లలు భాగస్వామ్యం అయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దోహదపడాలని పిలుపునిచ్చారు.
Read Also- Mouni Roy: బాలీవుడ్ నటికి ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం.. వద్దన్నా చేతులు వేస్తూ..
ఆడ పిల్లలకు సరైన నైపుణ్యలను అందిస్తే ఆకాశమే హద్దుగా వారి భవిష్యత్ సాగుతుందని మహేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో మహిళలు, ఆడపిల్లల మీద ఉండే సాంఘిక వివక్షను అరికట్టి వారిప్రాధాన్యత గురించి అవగాహన పెంచడానికి అందరూ కృషి చేయాలని అన్నారు. డీడబ్ల్యూవో హేమ భార్గవి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలు, పిల్లలు ఎదుర్కొనే సమస్యలను ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని తెలంగాణ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీహెచ్ఈడబ్ల్యూ సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది, బాలికలు, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

