Republic Day 2026: మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ ఆచార్య జయశంకర్ చౌరస్తాలో గణతంత్ర దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సమితి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరు శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతమాత ఆంగ్లేయుల దాస్య శృంకలాలను ఛేదించుకొని ఆగస్టు 15న స్వాతంత్ర ఊపిరి పీల్చుకుంటే, జనవరి 26న తన రాజ్యాంగాన్ని రూపొందించుకొని సర్వసత్తాక దేశంగా అవతరించిందని అన్నారు.
Also Read: Republic Day 2026: అబ్బురపరిచిన ఏపీ శకటాలు.. అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు!
ఎంతోమంది త్యాగల పోరాట ఫలితం
ఎంతోమంది త్యాగదనుల పోరాట ఫలితంగా సాధించుకున్న దేశంలో ఉత్తమ పౌరులుగా మన గాల్సిన బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ స్వామి యాదవ్, నాయకులు బాల్ రెడ్డి, మధుకర్ యాదవ్, సంతోష్ గౌడ్, సత్యపాల్ రెడ్డి, ప్రవీణ్, యు ది ష్టర్ రెడ్డి, రాజిరెడ్డి, మురళి, సాయి, రాజశేఖర్ రెడ్డి, వెంకటేష్, రాధాకృష్ణారెడ్డి, రవితేజ. బ్రహ్మ. సందేశ్. మైపాల్ రెడ్డి. బాలచందర్. శ్రీనివాస్ పాల్గొన్నారు.
Also Read: Republic Day: రిపబ్లిక్ డే రోజున.. జాతీయ జెండాకు అవమానం.. ఏం జరిగిందంటే?

