Republic Day: గణతంత్ర దినోత్సవం రోజునే చివ్వెంలా మండలంలోని పాచ్చనాయక్ తండాలో జాతీయ జెండాకు తీవ్ర అవమానం జరిగింది. 77వ గణతంత్ర వేడుకల్లో భాగంగా అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన చేసిన అనంతరం జెండాను సరిగ్గా పైకి జరిపి జాగ్రత్తగా కట్టాల్సింది పోయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జాతీయ జెండా నేలపై పడిపోయింది. దీంతో అధికారుల నిర్లక్ష్యం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాచ్చ తండా అంగన్వాడి కేంద్రంలో జెండాను అధికారులు గాలికి వదిలేయడంతో జాతీయ జెండాకు తీవ్ర అవమానం జరిగిందని చర్చించుకున్నారు.
Also Read: Ramachandra Naik: భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది : ఎమ్మెల్యే రామచంద్రనాయక్!
పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే
జెండా ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే నేలపై పడిపోవడంతో అంగన్వాడి నిర్వాహకురాలు పర్యవేక్షణ సరిగా లేకపోవడంతోనే ఘటన చోటు చేసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జెండాని గాలికి వదిలేసి నేలపై పడేలా చేసి అవమానం జరిగేలా చేసిన అంగన్వాడి బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ జెండాకు అవమానం కలిగించడం సరైన పద్ధతి కాదని ఎంతో జాగ్రత్తగా జెండాను ఆవిష్కరించడంతోపాటు అంతే పదిలంగా జెండాను పైకి తీసుకెళ్లి భద్రంగా రెపరెపలాడేలా చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామస్తులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

