Karimnagar Crime (Image Source: Freepic)
క్రైమ్, తెలంగాణ

Karimnagar Crime: రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. పక్కింటి వారితో కిటికీ లొల్లి.. ప్రాణం తీసుకున్న మహిళ

Karimnagar Crime: ఇరుగు పొరుగు అన్నాక చిన్న చిన్న మనస్పర్థలు సహజం. పిల్లల విషయంలో బైక్ లేదా కారు పార్కింగ్ విషయంలో ఏదోక గొడవ పక్కింటి వారితో జరుగుతూనే ఉంటుంది. అయితే దీనిని కొందరు పెడచెవిన పెడితే.. మరికొందరు మానసికంగా మరింత డీప్ గా తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే పక్కింటి వారితో చోటుచేసుకున్న కిటికీ వివాదం కారణంగా తాజాగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కరీనంగర్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..

కరీంనగర్ పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కి చెందిన వడ్లకొండ లక్ష్మీరాజం పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నారు. తన ఆత్మహత్యకి గల కారణాలని సూసైడ్ నోట్ లో స్పష్టంగా తెలియజేశారు. అధికారులు, పక్కింటివారి వేధింపుల కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు లక్ష్మీరాజం స్పష్టం చేశారు. నిబంధనల పేరిట అధికారులు తన ఇంటి కిటికీలు పదే పదే తొలగించడం తనని మానసికంగా వేధింపులకి గురి చేసిందని వాపోయారు. దీనిని తాను అవమానంగా భావించినట్లు పేర్కొన్నారు.

పక్కింటి వారితో వివాదం..

వడ్లకొండ లక్ష్మీరాజంకి పక్కింటి వారితో గత మూడేళ్లుగా వివాదం కొనసాగుతోంది. లక్ష్మీరాజం సెట్ బ్యాక్ నిబంధనలు ఉల్లంగించారని 2023లో కరీంనగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు మొదటిసారి ఇంటి కిటికీలు తొలగించారు. ఈ క్రమంలో ఆమె ఇంటి లోపలి వైపు నుంచి తిరిగి కిటికీలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈసారి పక్కింటి వారు ఫిర్యాదు చేయడంతో మరోమారు అధికారులు ఆ కిటికీలను తొలగించారు.

Also Read: Harish Rao: ఆటో డ్రైవర్లు అంటే పట్టదా.. హమీ ఇచ్చి పట్టించుకోరా.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

పోలీసులకు ఫిర్యాదు

అయితే తాను నిబంధనల ప్రకారమే ఇల్లు, కిటికీలు నిర్మించుకున్నానని.. అయినప్పటికీ కిటికీలు తొలగించడం ఏంటని ప్రశ్నిస్తూ లక్ష్మీరాజం గతంలో పోలీసులను ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని పోలీసులు, టౌన్ ప్లానింగ్ అధికారుల వద్దకి వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని సూసైడ్ నోట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే పక్కింటివారితో మాట్లాడుకోవాలని అధికారులు సూచించినట్లు చెప్పారు. ఈ క్రమంలో పక్కింటివారి వేధింపులు ఎక్కువ కావడం.. ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉండటంతో లక్ష్మీరాజం మరింత అవమానంగా భావించింది. దీంతో తన చావుకు పక్కింటి వారు, టౌన్ ప్లానింగ్ అధికారులే కారణమని చెబుతూ సంబంధిత వ్యక్తుల పేర్లను సూసైడ్ నోట్ లో లక్ష్మీరాజం రాశారు. అనంతరం పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచారు. ఘటనపై కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Tragedy Love Story: ఐదు రోజుల్లో పెళ్లి.. ప్రియురాలిని మింగేసిన గోదావరి.. లవ్ స్టోరీలో తీవ్ర విషాదం

Just In

01

Wines Lucky Draw: అరచేతిలో అదృష్ట లక్ష్మీ.. ఒకే ఇంట్లో ఇద్దరికి లక్కీ కిక్కు..?

Spring Onions Benefits: ఉల్లికాడ‌ల‌ వలన ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Megastar Chiranjeevi: చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు వైరల్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!

MLC Kavitha: త్వరలో వారి చిట్టా బయటపెడతా అంటూ.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

Bigg Boss 9 Telugu: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. ఎందుకు డిఫెన్స్ చోసుకోలేదు.. కళ్యాణ్‌ను రఫ్పాడించిన శ్రీజ!