CM Revanth Reddy (imagecredit:twitter)
తెలంగాణ

CM Revanth Reddy: రాష్ట్రంలో అన్ని శాఖలపై సమగ్ర నివేదిక ఇవ్వండి.. సీఎం వార్నింగ్..?

CM Revanth Reddy: రాష్ట్రంలోని అన్ని శాఖలకు సంబంధించిన సమగ్ర నివేదిక మంత్రులకు అందజేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అన్ని శాఖల ఉన్నతాధికారులకు వెంటనే రిపోర్ట్ తయారీపై ఫోకస్ పెట్టాలని ఆదేశాలు వెళ్లాయి. ఇటీవల క్యాబినెట్ సమావేశం తర్వాత ఆఫీసర్లపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అడుగుతున్న వివరాలను అందజేయడంలో జాప్యం చేస్తున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పైగా, మంత్రులకు సరైన వివరాలు ఇవ్వడం లేదని తెలుసుకున్న సీఎం, ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖలకు సంబంధించి సమగ్రమైన రిపోర్ట్ కోరారు. పదేళ్లలో జరిగిన టెండర్లు, బడ్జెట్ అంచనాల పెంపు, ప్రాజెక్టుల పురోగతి, వైఫల్యాలు, పథకాల అమలులో నిర్లక్ష్యం వంటి తదితర అంశాలపై సమగ్ర నివేదికను వెంటనే మంత్రులకు సమర్పించాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నివేదికల తయారీలో నిర్లక్ష్యం వహించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టమైన హెచ్చరిక జారీ చేయడంతో డిపార్ట్‌మెంట్లన్నీ హడావుడి పడుతున్నాయి.

నిర్లక్ష్యంపై సీఎం సీరియస్

​గత ప్రభుత్వ హయాంలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో జరిగిన తీవ్ర నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగంతో పాటు టెండర్లు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిబంధనల ఉల్లంఘనపై కాంగ్రెస్(Congress) సర్కార్ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దీంతోనే శాఖల వారీగా పదేళ్ల పాలసీలు, నిర్ణయాలు, తప్పిదాలపై పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి మంత్రులకు సమర్పించాలని ఆదేశించింది. నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ఒప్పందాలు, భూ కేటాయింపులు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, డెవలప్‌మెంట్ కాంట్రాక్టులు వంటి వాటిలో జరిగిన తప్పిదాలను పూర్తి స్థాయి వివరాలతో వెలికితీసి ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాదు, టెండర్ల ప్రక్రియలో జరిగిన అక్రమాలు, అంచనా వ్యయం ఇష్టారీతిగా పెంచడం, నాణ్యతా లోపాలపై కూడా ప్రభుత్వం కూలంకషంగా వివరాలను కోరింది.

Also Read: Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

పెండింగ్ పనులపై ఫోకస్

డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్లక్ష్యం కారణంగా ఆలస్యం కావడం, లేదా పూర్తిగా నిలిచిపోవడంపై ప్రభుత్వం నివేదికలు కోరింది. గత ప్రభుత్వ ఆధ్​వర్యంలో నిరుద్యోగం, ఉద్యోగ నియామక ప్రక్రియలో జాప్యం వంటి అంశాలపై కూడా రిపోర్ట్ తయారు చేయనున్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాల అమలు తీరు, నిధుల ఖర్చు, వాటి ఫలితాలపై నివేదికల్లో స్పష్టత ఇవ్వాలని సూచించారు. గతంలో కొందరు అధికారుల జోక్యంతో ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC) వెల్ఫేర్ శాఖల్లో అక్రమాలు జరిగాయని వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై కూడా ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించనున్నది. తప్పిదాలు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటూనే ప్రజలకు ఓ స్పష్టత ఇవ్వాలని చూస్తున్నది. ఈ నివేదికల తయారీతో చర్యలతోపాటు మంత్రులకూ ఆయా అంశాలపై స్పష్టమైన పట్టు లభిస్తుందనేది ప్రభుత్వం భావన.

Also Read: Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?

Just In

01

Bigg Boss 9 Telugu: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. ఎందుకు డిఫెన్స్ చోసుకోలేదు.. కళ్యాణ్‌ను రఫ్పాడించిన శ్రీజ!

KTR: తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది: కేటీఆర్

Shreyas Iyer Injury: ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.. అసలు ఏం జరిగిందంటే ?

Suryapet News: ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలి: ఎస్పీ నరసింహ

Haryana: సిస్టర్స్ డీప్ ఫేక్ వీడియోలు.. సోదరుడు ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు