Ramchandra Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని, రెండు రాష్ట్రాల నేతలు కలిసి ఇక్కడ పని చేస్తామని ఏపీ(AP) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్(PVN Madhav) తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao)ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలకు సంబంధించిన అంశంతో పాటు రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహం, కార్యకలాపాల సమన్వయం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేలా చేపట్టే కార్యక్రమాలపై ఇరువురు అధ్యక్షులు చర్చించారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పార్టీని బలోపేతం చేసేలా, మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్..
అనంతరం మాధవ్ మీడియాతో మాట్లాడుతూ, తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తెలంగాణ(Telangana) బీజేపీ కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యాలయంతో తనకు అనేక స్మృతులు ముడిపడి ఉన్నాయన్నారు. రెండు ప్రాంతాల ప్రజలు తమకు రెండు కళ్ళు అని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్‌లా ముందుకు సాగుతున్నదని తెలిపారు. ఏడాదిలో రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులు జరగడం శుభశూచికమన్నారు. అనేక కంపెనీలు, పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వస్తున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ(PM Modhi) చొరవతో గూగుల్(Google) లాంటి సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని, అది డబుల్ ఇంజిన్ సర్కార్ గొప్పతనంగా అభివర్ణించారు. తెలంగాణలో సైతం డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, డబుల్ ఇంజిన్ తోనే అభివృద్ధి సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రెండు రాష్ట్రాల నేతలు కలిసికట్టుగా పని చేసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్(Deepak Reddy)డి గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు.
జేపీతో రాంచందర్ రావు భేటీ..
లోక్ సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ(Jayaprakash Naryana)తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchender Rao) భేటీ అయ్యారు. హైదరాబాద్(Hyderabad)లోని జేపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పరిపాలన సంస్కరణలు, ప్రజా ప్రయోజన అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ భేటీ అనంతరం పెన్షనర్స్ బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్(CM revanth Reddy)డికి రాంచందర్ రావు లేఖ రాశారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు అందాల్సిన బెనిఫిట్స్‌ను వెంటనే అందజేయాలని కోరారు.
Also Read: Ranga Reddy District: కార్పొరేట్ పేరుతో కోట్ల వసూళ్లు.. ప్రైవేట్ స్కూల్స్‌పై పర్యవేక్షణ ఎక్కడ?
