Ranga Reddy District: ప్రైవేట్ స్కూల్స్‌పై విద్యాశాఖాధికారులు పర్యవేక్షణ పూర్తిగా కోరవడింది. కేవలం పైపై పర్యవేక్షణతో కాలం వెల్లదిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు విభిన్నంగా అధికారులు తీరు కనిపిస్తోంది. అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో ప్రతి ప్రైవేట్ స్కూల్స్ విధిలో భాగంగా పర్యవేక్షించాలి. కానీ కేవలం పర్యవేక్షించామని చెప్పుకోవడానికే పరిమితమై విద్యాధికారులు పనిచేస్తున్నట్లు స్పష్టమైతుంది. ఎప్పటికప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా క్షేత్రస్థాయి అధికారులతో సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. ఇవేమీ తమకేమి అవసరం లేదన్నట్లు కేవలం ప్రభుత్వ స్కూల్స్ పర్యవేక్షణపై ప్రభుత్వం సూచించే సూచనలను అమలు చేస్తూ పనిచేస్తున్నారు. విద్యావ్యవస్థ ఎవరికివారే యమున తీరు అనే విధంగా పనిచేస్తున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నర్థాకంగా మారుస్తున్నారు.
Also Read: Ranga Reddy District: పోస్టులు ఖాళీగా ఉండడంతో.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు!
బరాబర్ ఫీజులు వసూళ్లు
విద్యార్ధుల తల్లిదండ్రులను కార్పోరేట్ పేరుతో నమ్మించి నిబంధనలకు విరుద్దంగా స్కూల్లో చేర్చుకుంటారు. ఎల్కేజీ నుంచే లక్షల్లో పీజులు వసూళ్లు చేస్తారు. కానీ విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ నిర్వహాణను గాలీకి వదిలేస్తారు. నిబంధనలు పాటించకుండా విద్యార్థులకు పాఠాలు చేబుతామని ప్రచారం చేసుకుంటారు. ఇలాంటి స్కూల్స్‌లో విద్యార్థులను చెర్పించి భవిష్యత్తు విద్యకు దూరం చేస్తున్న పరిస్థితులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి.
ఫీజులకు తగ్గట్టుగా ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహాణ ఉండాల్సిన బాధ్యత ఎంతైన ఉంటుంది. ఈ నిబంధనలను పాటించేలా జిల్లా విద్యాధికారులు పనిచేయాలి. ఈ అంశాలను పక్కకు పెట్టి కేవలం రాయభారంతోనే ప్రైవేట్ యాజమాన్యం అధికారులు కుమ్మక్కైతున్నారు. అధికారులు, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం కలిసి ఆడుతున్న నాటకాలతో విద్యార్ధులు బలైతున్నారు. వీటిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తారు. ఎందుకంటే ఆ యాజమాన్యంతో అధికారులు ఇప్పటకే కుమ్మక్కై చేతివాటలకు ఆలవాటై తలదాచుకునే దుస్థితి ఉంది. మేడ్చల్ జిల్లా కుత్బల్లాపూర్లో జరిగిన సంఘటనలకు అధికారులే బాధ్యులని చెప్పక తప్పదు.
బంధనలకు విరుద్దంగా నిర్వహాణ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని పెట్ బషీరాబాద్లోని శ్రీ చైతన్య స్కూల్ను శనివారం మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. స్కూల్ నిర్వహిస్తున్న భవనం నివాసగృహాం పేరుతో జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నారు. అదే భవనంలో నిబంధనలకు విరుద్దంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నడిపించడం కమర్షియల్‌గా అధికారులు గుర్తించారు. అయితే ఈ స్కూల్స్ ప్రారంభ దశలో పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నిరెత్తిన్నట్లు వ్యవహారించారు.
విద్యార్ధుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్న వైనం
ఇప్పుడు స్కూల్ల్లోని విద్యార్ధుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్న వైనం కనిపిస్తుంది. మున్సిఫల్ అధికారులు సీజ్ చేసిన స్కూల్ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విద్యాశాఖాధికారులు జంకుతున్నారు. ఎటుకాకుండా మిడిల్ ఆఫ్ దిఇయర్లో స్కూల్స్ సీజ్ చేస్తే విద్యార్ధుల పరిస్థితి ఎమీటని తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. సుమారుగా 700 మంది విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిపోయింది. అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయం స్కూల్స్ ప్రారంభంలోనే చూడాల్సిన బాధ్యత ఇటు విద్యాశాఖాధికారులది… అటు మున్సిపాలిటీ అధికారులదని తల్లిదండ్రులు ఆవేధ వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Ranga Reddy District Tahsildar: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్!
