Gadwal District: సీఎంఆర్ అప్పగించే విషయంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కోసం మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మర ఆడించి బియ్యాన్ని నిర్ణీత సమయంలో తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. రైతుల నుంచి ధాన్యం కొని మిల్లుల్లో బియ్యంగా మార్చి రేషన్ షాపులకు తరలించే క్రమంలో మిల్లర్లు కోట్లాది రూపాయల అక్రమ దందాకు తెరలేపారు. సంవత్సరం లోపు మిల్లులకు తరలించిన వడ్లను బియ్యంగా మార్చేందుకు సమయం ఉండడంతో మిల్లర్లకు కేటాయించిన సీఎంఅర్ ధాన్యం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించి ఎక్కువ ధరలకు సొమ్ము చేసుకుంటున్నారు.
Also Read: Gadwal District: నడిగడ్డలో ఊహకందని రాజకీయాలు.. స్థానిక సంస్థల ఎన్నికలో పై చేయి ఎవరిది?
గతంలో పట్టుబడిన సీఎంఆర్ ధాబ్యం లారీలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.ప్రభుత్వం ఇచ్చే క్వింటాల్ వడ్లకు 67 కిలోల బియ్యం చొప్పున మిల్లర్లు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలో కొన్ని రైస్ మిల్లుల యజమాన్యం తక్కువ ధరలో ఉన్న సన్న వడ్లను మర ఆడించి రేషన్ బియ్యం రూపంలో సివిల్ సప్లయ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి అందిస్తున్న ఘనులు తయారయ్యారు. మరి కొందరు మిల్లులు నడపకుండానే గ్రామాల్లో కొన్న బియ్యాన్ని తీసుకువచ్చి చూపిస్తున్నారని తెలిసింది.
రేషన్ బియ్యం దందా
ఇది ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల నుంచి సకాలంలో సీఎంఆర్ తీసుకోవడంతో పాటు రేషన్ బియ్యం దందాను అరికట్టేందుకు సివిల్ సప్లయ్ శాఖ అధికారులతో మిల్లర్లు చెట్టాపట్టాలు వేసుకుని తిరగడంతో మిల్లర్లు రాజ్యమేలుతున్నారు. సీఎంఅర్ ధాన్యం పక్కదారిపట్టిస్తూ కోట్ల రూపాయాలు సంపాదిస్తున్న మిల్లర్ల పై చర్యలు తీసుకోవడానికి జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు చర్యలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని రైస్ మిల్లుల నుంచి నాణ్యత లేని బియ్యాని రేషన్ షాపుల ద్వారా లబ్దిదారులకు అందిస్తున్నారని ఆరోపణలు వస్తున్న క్రమంలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు డబ్బులు తీసుకొని నాణ్యతలేని బియ్యాన్ని సివిల్ సప్లయ్ శాఖ తీసుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.
మిల్లర్ల మాయాజాలం
జోగుళాంబ గద్వాల జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులు ప్రభుత్వానికి సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) ఇవ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రతి సీజన్‌లో ప్రభుత్వం పలు ఏజెన్సీలతో నేరుగా కొనుగోలు చేస్తున్నారు. అలా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) కోసం రైస్ మిల్లర్లకు అప్పగిస్తుంది. ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్న మిల్లర్లు దాన్ని మరాడించి, బియ్యంగా మార్చి పౌరసరఫరాల శాఖ ద్వారా తిరిగి ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. కాగా సీఎంఆర్ కోసం సీజన్ల వారీగా ఎప్పటికప్పుడు ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఏ సీజన్‌లో వచ్చిన ధాన్యాన్ని అదే సీజన్‌లో ఇవ్వాల్సి ఉన్నా మిల్లర్లు ఏళ్ల తరబడి పక్కదారి పట్టిస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో సీఎంఆర్ పెండింగులో పడింది. ఇటీవల కేటిదొడ్డి, గద్వాలలో పలు రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారుల తనికీల్లో బహిర్గతమైంది.
Also Read: Gadwal Collectorate: బుక్కెడు బువ్వ కోసం వృద్దురాలు ఆరాటం.. జన్మనిచ్చిన తల్లి గురువులకు భారమా?
రేషన్ బియ్యం దందాకు అడ్డే లేదు
అధికారుల అండతో రైస్ మిల్లర్లు రేషన్ బియ్యాన్ని అక్రమంగా మిల్లులకు తరలిస్తున్నారు. జిల్లా కేంద్రంలో బీరెల్లి రోడ్డులో గల ఓ రైస్ మిల్లుకు గత వారం రోజుల కిందట రేషన్ బియ్యం తరలిస్తున్నారని పక్కా సమాచారంతో స్థానికులు డయల్ 100కు పోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. మిల్లుకు తరలించే రేషన్ బియ్యం అరికట్టాల్సిన పోలీసులు, మిల్లు యజమానితో మిలాఖత్ అయి డయల్ 100కు పోన్ చేసిన స్థానికుల పై కేసు పెడుతామని బెదిరించడంతో స్థానికులు చేసేదేమి లేక వెనుదిరిగి వెళ్లారు. అంతేకాకుండా రైస్ మిల్లుకు తరలిస్తున్న రేషన్ బియ్యాని పోన్ లో రికార్డు చేసిన స్థానికుల పోన్ లు పోలీసులు లాకొని డెలీట్ చేయడం ఇప్పుడు జిల్లా కేంద్రంలో చర్చగా మారింది. ఇలా జిల్లాలోని పలు రైస్ మిల్లులకు నిత్యం రేషన్ బియ్యం తరలించి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే 2025 యాసంగి సీజన్ సిఎంఅర్ ధాన్యం ఇతర రాష్ట్రాలలో విక్రయించి వాటి స్థానంలో తక్కువ నాణ్యతతో కూడిన సన్న బియ్యాని మర ఆడించి ప్రభుత్వానికి రేషన్ బియ్యం అందిస్తున్నారు. కొన్ని మిల్లులు ఏకంగా రేషన్ కార్డు లబ్దిదారుల నుంచి సేకరించి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు.
కేసులు నమోదు చేసిన చర్యలు శూన్యం
గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల చేతివాటం పతాకస్థాయికి చేరుకున్నది. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం విషయంలో అధికారులు అండదండలతో కొంతమంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. 2023-2024, 2024-25 సంవత్సరానికి సంబంధించి రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యం లెక్కలను రాష్ట్ర విజిలెన్స్ అధికారులు బృందాలుగా ఏర్పడి అయా మిల్లులో తనిఖీలు చేయగా ఆయా మిల్లులకు కేటాయించిన ధాన్యం వివరాలతోపాటు ధాన్యాన్ని మిల్లింగ్ చేయగా నిల్వ ఉన్న బియ్యం వివరాలను పరిశీలించారు. కేటి దొడ్డి మండలం నందిన్నె లోని ఓ రైస్ మిల్లుకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యం మరాడించి ప్రభుత్వానికి బియ్యాన్ని సక్ర మంగా అందించలేదు. విజిలెన్స్ అధికారులు తనిఖీలో సుమారు 7 కోట్ల పైననే విలువైన ధాన్యాన్ని స్వాహా చేసినట్లు తేలింది.
2. 25 కోట్ల విలువచేసే సీఎంఆర్ ధాన్యం పక్కదారి
దీని ఆధా రంగా మిల్లు యజమానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి చేతు లు దులుపుకున్నారు. మిల్లుల యజమానికి ఆర్ఆర్ ఆర్ట్ కింద విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గద్వాల పట్టణంలోని డ్యాం కు వెళ్లే దారిలో ఉండే ఓ రైస్ మిల్లును ఈనెల 18న హైదరాబాద్ నుండి వచ్చిన విజిలెన్స్ అధి కారులు తనిఖీలు చేయగా 2022-23 వానకాలం యాసంగి 2024 25 కు సంబందించిన 2. 25 కోట్ల విలువచేసే సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు విచారణలో తేలింది . ఇలా జిల్లాలోని కొన్ని రైస్ మిల్లుల యజామాన్యం బహిరంగానే అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకాడుతున్నారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ లెక్కన మిల్లర్లు ఎంత అవినీతి జరిగిందో తెలుసుకో వచ్చు దీని వెనక ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో మిల్లు యజమాని సివిల్ సప్లై అధికారులకు కేటాయించిన ధాన్యం బయట విక్రయించి రాయచూర్ నుండి రెండో క్వాలిటి బియ్యాన్ని తెచ్చి ప్రభుత్వానికి సరిపడా చేసినట్లుగా తెలిసింది ఈ విషయం జిల్లా సివిల్ సప్లై అధికారులకు తెలిసిన ప ట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో గల రైస్ మిల్లులకు రేషన్ బియ్యం తరలిస్తున్నారన్నా ఆరోపణ నేపథ్యంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు పోన్ లో సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు.
Also Read: Gadwal District: గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టిన జిల్లా గ్రంధాలయ చైర్మన్
