Gadwal District: ప్రజాపాలన దినోత్సవం రోజు జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీళ్లి శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్పను అవమానించిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముందు బహుజన సామాజిక వర్గం నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రోటోకాల్ ప్రకారం వేదిక పైకి పిలవాల్సి ఉండగా తమను అవమానించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాస్,అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ను వేదికపైకి ఆహ్వానించి,తమను అగౌరవపరిచారన్నారు. ఆ కార్యక్రమానికి ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ వ్యవహారాలను చూసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: Little Hearts box office: నార్త్ అమెరికాలో ‘లిటిల్ హార్ట్స్’ బిగ్ సక్సెస్.. గ్రాస్ ఎంతంటే..?
ఎమ్మెల్యే సైతంఏకపక్ష ధోరణి
ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసిన తమకు ఇలాంటి అవమానం జరగడం బాధాకరమన్నారు. దేవర బహుజనులనే కారణంతోనే అవమానిస్తున్నారా అని వారు ప్రశ్నించారు. గతంలో అనేక కార్యక్రమాలకు సైతం తనను ఆహ్వానించలేదన్నారు. ఎమ్మెల్యే సైతంఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నాడన్నారు. ధర్నా కార్యక్రమానికి అలంపూర్ నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రోటోకాల్ రగడకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ సమస్య తలెత్తడంతో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆయనకు సర్ది చెప్పి వేదిక మీదకు ఆహ్వానించారు.
ఘటనకు కారకులైన ఇద్దరిపై సస్పెన్షన్ వేటు
అడిషనల్ కలెక్టర్ సి.సి రాఘవేంద్ర గౌడ్ కార్యక్రమానికి ప్రోటోకాల్ వ్యవహారాలు చూశాడు. కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనకు కారకులుగా భావించి ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయగా గ్రంథాలయ చైర్మన్ పట్ల దురసుగా ప్రవర్తించి, నెట్టడంపై కేటి దొడ్డి మండల పి.ఎస్ కు చెందిన మల్లేష్ పై సైతం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సస్పెన్షన్ వేటు వేశారు. ధర్నాకు గంజిపేట శంకర్, నల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి, ఎన్ ఎస్ యు ఐ వెంకటేష్ నాయుడు తదితరులు వారికి మద్దతుగా నిలిచారు.
Also Read: Shiva re-release: కింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. ‘శివ’ సినిమా రీ రిలీజ్ డేట్ ఫిక్స్..