Gadwal Collectorate: సమాజంలో విద్యావంతులుగా ఉండి,పాఠాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాళ్లు తమ సొంత కన్న తల్లిని పట్టించుకోకుండా ఆమెకు వున్నా యావదాస్తిని రాయించుకొని కన్న తల్లి యోగక్షేమలు పట్టించుకోకుండా కర్కాశంగా తయారైనా కొడుకులుపై బుక్కెడు బువ్వ కోసం జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం (Gadwal Collectorate) లో ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా తల్లి శంకరమ్మ కొడుకులు, కూతురు పై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ కార్యాలయం (Gadwal Collectorate)లో ఆమె రోదనలు ప్రతీ ఒక్కరిని కలిచివేసింది.
Also Read: Gadwal Collector: అన్నదాతలు ఆర్థికంగా ఎదిగేందుకు అధికారులు కృషి చేయాలి : కలెక్టర్ బి. ఎం. సంతోష్
ఆమెకు ఇద్దరు కుమారులు
వివరాలకు వెళితే గద్వాల పట్టణానికి చెందిన ఈద శంకరమ్మ, వయస్సు (68) వీవర్స్ కాలనీలో నివాసం ఉండగా ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మంచి స్థానం లో ఉండగా వంశంపార్యాంపరంగా వచ్చిన ఆస్తులను ఇద్దరు కుమారులకు, కూతురి పేరిట సమాన బాగాలుగా ఆస్తిని పంపకాలు జరిగాయని పెద్దల ఒప్పందం లో కుమారులు నెలకు 10,000 రూపాయలు, కూతురు నెలకు 2,000/- రూపాయలు తల్లికి ఇచ్చేవిధంగా పెద్దలు నిర్ణయించారాని ఆమె తెలిపారు.
డబ్బులకోసం వస్తే తన్ని తరిమేస్తాం
ఆస్తిని పంచుకొన్న తరువాత కన్న పిల్లలు ఆమె కు ఇవ్వాల్సిన నెలసరి ఖర్చులకోసం డబ్బులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్వతం ఐయ్యారు ఆమె. అనారోగ్య కారణాల వల్ల ప్రతీ నెల మందులకోసం ఇబ్బంది అవుతుందని కొడుకులను డబ్బులు అడిగితె డబ్బులకోసం వస్తే తన్ని తరిమేస్తామని తనను బెదిరించారని ఆమె ఏడుస్తూ మీడియా ముందు వాపోయారు.
Also Read: Gadwal District: ఇందిరమ్మ ఇళ్ల ఇసుక టిప్పర్ల నిలిపివేత.. కమిషన్ కోసమే అడ్డుకుంటున్నారా?
