CM Revanth on Betting Apps
తెలంగాణ

CM Revanth on Betting Apps: బెట్టింగ్ యాప్స్ ఆగడాలపై సీఎం రేవంత్ కన్నెర్ర.. అసెంబ్లీలో కీలక ప్రకటన

CM Revanth on Betting Apps: ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన బెట్టింగ్ యాప్స్ బాగోతాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ గా తీసుకున్నారు. వాటిని నిరోధించేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్, రమ్మీ గేమ్స్ పై కఠినంగా ఉండనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Sessions) సందర్భంగా బెట్టింగ్ దురాగతాలపై మాట్లాడిన రేవంత్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బెట్టింగ్స్ పై సమరమే!

బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి కఠిన శిక్షలు విధించేలా చట్టంలో సవరణలు తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. గత ప్రభుత్వమే బెట్టింగ్ యాప్స్ ను నిషేధిస్తూ చట్టం చేసిందన్న రేవంత్.. అయితే దానిని అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ దుర్వినియోగం ఎక్కువైందని రేవంత్ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ నేరాలు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయన్న రేవంత్.. ఒక స్టేషన్ పరిధిలోనో, రాష్ట్ర స్థాయిలోనో విచారణ చేస్తే ఫలితం ఉండదని అభిప్రాయపడ్డారు. కాబట్టి డిజిటల్ గేమింగ్ బెట్టింగ్స్ పై అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించినట్లు రేవంత్ అన్నారు. బెట్టింగ్ యాప్స్ నివారణ, నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఒక స్పెషల్ ఇన్ వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహించాలని నిర్ణయించినట్లు సభకు తెలియజేశారు.

Also Read: Ranga Reddy District: ‘ఖాకీ’ సినిమా రేంజ్ ట్విస్టులు.. ఈ కేసు చూస్తే మతి పోవాల్సిందే!

విపక్షాలపై మండిపాటు

తెలంగాణలో శాంతి భద్రతలు లేవని దుష్ప్రచారం చేస్తూ పెట్టుబడులను అడ్డుకునేందుకు విపక్ష పార్టీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి కుట్రలు రాష్ట్రానికి మంచిది కాదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రికార్డు స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని రేవంత్ గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం ఏ మంచి పని చేపట్టాలన్నా దానికి విపక్ష పార్టీ దురుద్దేశం ఆపాదిస్తోందని రేవంత్ అన్నారు. ఈ రాష్ట్రం దివాళా తీస్తే తమకు సంతోషమన్న విధంగా విపక్ష పార్టీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామరస్య వాతావరణం

గత ప్రభుత్వాలు నేరగాళ్లను అణిచి వేసి శాంతి భద్రతలను నెలకొల్పడం వల్లే అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ కు తరలివచ్చాయని సీఎం రేవంత్ అసెంబ్లీలో గుర్తు చేశారు. తద్వారా సైబరాబాద్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ఏరియాలు అభివృద్ధి చెందియాని రేవంత్ అన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ లో మతకల్లోలాలు ఉండేవన్న రేవంత్.. వాటిని గత పాలకులు నిర్మూలించి సామరస్య వాతావరణాన్ని నెలకొల్పారని కొనియాడారు.

ఇవి కూడా చదవండి

Dogs Cry at Night: కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయి.. ఇది శుభమా.. ? అశుభమా?

Case on Bandi Sanjay: బండి సంజయ్ కు ఊహించని ఝలక్.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు!

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు